ముందుమాట
మున్లిమ్ వర్సనల్ లా నమన్య ఎంతో తీవ్రతరమయి ముందుకు వచ్చింది. మున్లిములలో అది ఎంతో కలవరాన్ని, ఆందోళనను సృష్టించింది. దీన్ని చూని మతానికి ఆధునికీకరణ చెయ్యాలని కోరేవారు, నవ నాగరికతా (ప్రేమికులు ఈ సమస్యకు లేనిపోని ప్రాధాన్యత ఇవ్వుబడుతోందని తలపోస్తున్నారు. ఈ విషయమయి ముస్లిములు కళవళపడీపోవటం నరికాదని, అనలు వారి ఈ కలవరానికి కారణం మతంలోనూ, ననాతన భావాలతోనూ వారికిగల మితిమీరిన అనుబంధమేనని నవ నాగరికతా ధ్వజవావాకులు అభిప్రాయవడుతున్నారు: మానవ జీవితం నుండి రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలువంటి రంగాలకు వూర్తి స్వేభ్భనిచ్చినల్లే సామాజిక రంగాన్ని జీవితం నుండి పూర్తిగా: విముక్తం చేయాలని, అది నర్వ న్వతంత్రంగా ఉండాలని వీరు కోరుతున్నారు. రాజకీయ, ఆర్థిక జగత్తులో చెలామణీ అవుతున్న సెక్యులరిజం నాణెం “ఇంట్లో” (కుటుంబంలో) కూడా చెల్లుబాటయ్యేలా చేయాలన్నది వారి ఆకాంక్ష ఈ రకమయిన ఆలోచనా నరళి గలవారు ఇస్లామను కూడా ఇతర మతాల నరనన నిలబెడుతున్నారు. ఇస్లామ్ దైవం నమ్మతించి ఆమోదించిన ధర్మమన్సుద్శి అది ఒక వరివూర్హ జీవన వ్యవస్ధ అన్హది వారి బుద్ధికందదు. ఇస్లామ్ సామాజిక నియమాలు, చట్టాలు ఒకవేళ దైవం తరవున అవతరింవజేయబడినవే అయినప్పటికీ వాటిని కాలానుగుణంగా నవరించుకునే హక్కు మొత్తమ్మీద మనిషికి ఊండాల్సిందేనన్హది వారి అభిమతం. చూడబోతే, మున్లిమ్ వర్గనల్ లా గురించి నరిగా తెలీనివారు కూడా అధికంగానే వున్నారు. ముస్లిమ్ వర్భనల్ లాను నమర్జిస్తూ ముస్లిములు వ్రకటనలు చేసినా లేక తమ వర్సనల్ లాలో ఇతరుల జోక్యాన్సి నిరనించినా అదంతా అనవనరమైన రోదన అని ఈ ట్రబుద్దులు తేలిగ్గా కొట్టివేస్తారు. వీళ్ళ దృష్టిలో మున్లిమ్ వర్భనల్ లా అంటే భావం, ఒకటికన్నా ఎక్కువ వివాహాలు చేనుకోవటానికి అనుమతినిచ్చే చట్టం అన్హ్రది మాత్రమే. అందువల్ల ఒక భార్య ఉండగా మరో వివాహం చేసుకునేందుకు
ఇస్లామ్ 'అనుమతి భార్యల మధ్య న్యాయం చెయ్యగలిగే షరతు పైనే ఇచ్చింది. అదీ కేవలం 'అనుమతే' గాని 'ఆదేశం' కాదు. అటువంటప్పుడు ఒకటికన్నా ఎక్కువ వివాహాలు చేనుకోవటాన్సి నిషేధిస్తూ చట్టం చేసినట్లయితే దానివల్ల షరీఅతకుకలిగే మువ్చు ఏమిటి? - ఇదీ వారి వాదన. మున్లిమ్ వర్సనల్‌లాను రూవుమావటం వల్ల గాని, ఉమ్మడి నివిల్ కోడ్‌ను విధించటంవల్లగానీ ఎలాంటి వోని కలగబోదన్సుది వారి అభిప్రాయం. ఎందుచేతనంటే ఈ మార్పు వివావోది వ్యవవోరాలకు మాత్రమే వరిమితమై ఉంటుందని వారు తలపోస్తున్నారు. పానం వీరికి ముస్లిమ్ వర్సనల్ లా వరిధుల్సి గురించిగాన్సీ యూనిఫాం సివిల్ కోడ్ పరిధి గురించిగాని నరైన అవగావానే లేదు. వారు ముస్తిమ్ వర్గనల్ లాకు గల ధార్మిక ప్రాముఖ్యాన్ని గాని, నమానమైన నివిల్ కోడ్ (Uniform Civil 6049) మూలంగా ఇస్లామీయ షరీఅల్‌కు చెందిన ఏ ఏ నియమాలు, ఆదేశాలు నవరణల వాతన వడవలని వన్తుందోనన్ల విషయాన్ని గాని ఊహించలేకపోతున్నారు. అందుచేత ముస్లిమ్ వర్సనల్ లాను, దాని (ప్రాముఖ్యాన్చి విడమరచి చెప్పవలనిన ఆవశ్యకత, యూనిఫాం సివిల్ కోడ్‌ను వెనకేనుకు వచ్చేవారు ఇన్తున్సు ఆధారాలను వరిళీలించవలనిన అవనరం ఎంతయినా ఉంది. ఒకవేళ యూనిఫాం నీవిల్ కోడ్‌ను క్రోడీకరించి, ధాన్ని వ్రవేళపెట్టే అవస్టే గనక దావురి స్తే అప్పుడు దాని రూవురేఖలు ఎలా ఉంటాయో, ముస్లిముల కొరకు అది ఏ ఏ నమన్యల్సి తెచ్చి పెడుతుందో మరె లాంటి ఇక్కట్లలో.వారిని పడవేస్తుందో ఎరుకసరచటం కూడా అవసరమే. ఎందుకంటే వారి మనోవేదన, ఆందోళన అర్థరహితమయినది కాదు, పైగా అది వారి మౌలిక విశ్వాసాలతో ముడిపడి ఉన్ల నమన్య అని ఇంకా అది, వారు విళ్ళ నించి ఆచరించే ధర్మం వారి నుండి కోరుతున్న నవాజమైన విషయమని దాటి
చెప్పవలనిన ఆవశ్యకత ఉంది.
- ప్రకాశకులు
అనంతకరుణామయుడు అపార కృపాళీలుడయిన అల్లాహ్ పేరుతో యముసైము పఏర్షనల్ లా మీము.
చట్టం ఆవశ్యకత
చట్టం - అది మనిషి జీవితపు ఏ రంగానికి సంబంధించినదైనా - మానవు నికి, మానవ నాగరికతకి ఒక అనివార్యమయిన అవసరం. అది లేకుండా మానవ జెన్నత్యమూ లేదు, సంస్కృతి అన్నదీ ఉండదు. చట్టం వల్లనే మానవ సమాజం “సమాజం'గా రూపొందుతుంది. దీని మూలంగానే వ్యక్తుల హక్కులు పరిరక్షించ బడతాయి. సామాజిక వ్యవస్థకు రక్షణ, పటిష్టతగానీ దీనిద్వారానే చేకూరుతాయి. అన్యాయం, అధర్మాల వల్ల కలిగే వినాశం నుండి రక్షణ, శాంతి దీని వల్లనే లభిస్తాయి. ప్రజలకు--న్యాయం, సంతృప్తి దీని ద్వారానే ప్రాప్తమవుతాయి. మానవ నాగరికత మూడు పువ్వులు ఆరు కాయలుగా పరిఢవిల్లడానికి అవకాశం లభిస్తుంది. చట్టం రక్షణే గనక లేకపోతే ఎటు చూసినా అంతా లోపభూయిష్టంగా గోచరిస్తుంది. చట్టాలు లేని మానవ సమాజాల్లో ఆటవిక న్యాయం తాండవిస్తుంది. అందుచేత చట్టం, న్యాయస్థానాల స్థాపన మనిషికి అత్యంత అవసరమయింది. ఇంకా మానవ నైజం కూడా దాన్ని వాంఛిస్తుంది, ఎట్టి పరిస్థితిలోనూ మనిషి దానికి అతీతుడు కాలేడు అనేది యదార్థం.
ఉన్నత చట్టం: దాని మౌలిక గుణాలు ఈ యదార్థం, చట్టానికి రెండు గుణాలు అవసఠమంటోంది - (1) ఒకటేమంటే, అది, సమాజ సాఫల్యానికి, దాని పురోగతికి నిజంగా
'ఉపయోగపడేదై ఉండాలి. ఎందుకంటే అసలు చట్టం ఉనికిలోకి వచ్చింది ఈ
ఆశయం కొరకే. ఆ ఆశయం కోసమే మనిషి దాని (చట్టం) బంధనాలను తనపై విధించుకున్నాడు. అందుచేత ఏ సమాజంలోనయినా ఈ ఆశయం నెరవేరని చట్టం గనక అమల్లో ఉన్నట్లయితే ఆయా ప్రజలు చేసే ఈ తమ స్వేచ్భా స్వాతం త్రాల త్యాగం అనవసరమనే భావించవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిల్లో ఆ “చట్టం” అనబడేదాన్ని విధించడంలో ఎలాంటి హేతువూ మిగలదు. ఇంకా అది ఆ సమాజంలో సహించదగినదిగా కూడా ఉండరాదు.
(2) రెండో విషయం ఏమంటే, చట్టం అన్నది సమాజం యొక్క మౌలిక భావాలు, భావనలకు సరిపడేదిగా ఉండటం అవసరం. ఇంకా అది దాని నాగరికతా సూత్రాలు ప్రమాణాలను ప్రతిబింబించేదిగా ఉండాలి. ఆ సమాజపు భావావేశాలకు ప్రతిరూపంగా ఉండాలి. సముచితమయిన, ఫలప్రదమయిన చట్టం యొక్క లక్షణం ఏమంటే, ఏ ప్రజలపై అది విధించబడిందో వారు మానసి కంగా దానికి సన్నిహితులయి ఉండాలి. ఇంకా ఆ చట్టం పట్ల ఆ ప్రజల్లో గౌరవ భావం ఉండాలి. మనస్ఫూర్తిగా దానికి కట్టుబడి ఉండేందుకు వారు అంగీకరించాలి. అంతేగాని ఆ ప్రజలు ఆ చట్టాన్ని భరించరాని భారంగా భావిస్తూ, ఎలాగైనా ఆ శిరోభారాన్ని వదిలించుకునే ఆలోచనలో ఉండరాదు. వారు దానితో దాగుడు మూతలాడరాదు. ఏ చట్టంలోనయినా ఆ గుణాలు ఎప్పుడు వస్తాయి? సమాజంలో క్రియాత్మకంగా దానికి ఆ స్థానం ఎప్పుడు సంప్రాప్త్రమవుతుంది? అది ఆ సమాజపు నియమాలను, దాని విలువలను ఆకళింపు చేసుకుని తనలో జీర్ణం చేసుకోగలిగినప్పుడు! దాని వ్రేళ్ళు ఆ సమాజపు భావాలు భావనలతో పాతుకు పోయినప్పుడు!! హేతువు అనుభవాలు రుజువు చేసే సత్యమిది.
ఆలోచిస్తే ఈ రెండు విషయాల్లో రెండోది మొదటి దానికన్నా ముఖ్య మయినదే కాదు, అది మొదటి దానికి చాలా వరకు ప్రాతిపదికగా కూడా వ్యవహ రిస్తుంది అన్న విషయం బోధపడుతుంది. ఎందుకంటే ఏ చట్టమయినా ఆ సమాజ నియమాలు, విలువలు, భావాలు, భావనల ద్వారా రూపాందనంత వరకు అది శ్రేయోసాఫల్యాలకు ఉపయోగపడే సాధనం అనిపించుకోదు. కాబట్టి
Muslim Personal Law & Uniform Civil Code (Telugu)
నుస్తిం సర్గ నల్ లా యూానిసాం అనిల్ జోద్
మూలం: సద్రుద్దీన్ ఇస్లాహి షమ్స్ పీర్ణాద
అనువాదం: ముహమ్మద్ అజీజుర్రహ్మాన్
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్ట్ (రిజిష్టర్డ్) సందేశభవనం, లక్కడ్‌కోట్, 'హైదరాబాద్-500 002. ఫోన్: 24564583
చట్టం యొక్క పునాది కేవలం సామాజిక నియమాలు, విలువలపై ఉండాలి. ఇది ఆది మరియు అంతిమ అవసరం. అలా కాకపోతే అదొక మంచి శాసనమూ కాలేదు, సమాజానికి శ్రేయోసాఫల్యాలు చేకూర్చనూలేదు. ఇవేమీ అది చేయలేనప్పుడు ప్రజల నెత్తిపై కూర్చునే అధికారం కూడా దానికి ఉండకూడదు. ఇలాంటి “చట్టాన్ని” ఏ జాతి అయినా తన కొరకు నిర్మించుకుంటే నిజానికది దాని సంస్కృతీ నాగరికతలకు ఆత్మహత్యా సదృశమయిందే. ఒకవేళ వేరే శక్తి ఏదయినా దానిపై అటువంటి చట్టాన్ని రుద్దితే అది ఆ జాతి నాగరికత హత్యగా
అనుకోవలసి వస్తుంది. ముస్లిం పర్సనల్ లా ఎ తరహా చట్టం? చట్టం గురించిన అత్యంత ముఖ్యమయిన ఈ సూత్రప్రాయమయిన
యదార్భాన్ని దృష్టిలో ఉంచుకుని మరీ 'ముస్లిమ్ పర్సనల్ లా' (ముస్లిమ్ వ్యక్తిగత చట్టం) అనబడే ఈ చట్టాన్ని, దానీకి సంబంధించిన సమస్యను పరిశీలించండి. ఈ pies 'పేరునుబట్టే “ముస్లిముల వ్యక్తిగత చట్టం' అవడానికి భావం, స్పష్టంగా
లిసేదేమంటే - అది ముస్లిమ్ సమాజ (మిల్లత్) స్వభావ స్వరూపాలతో ప్రత్యేక బాషలు కలిగి ఉందనీ, ఇంకా అది మిల్లత్ ప్రత్యేక సిద్ధాంతాలు, దృక్పథాలకు ప్రతీక అని, దానిస సూత్రాలు, ప్రమాణాల ప్రతిబింబమని హః విదితమవుతోంది. : అదే కాకపోతే అసలది ఉనికిలోకి వచ్చేదే కాదు. 1400 ఏళ్ళుగా ముస్లిముల్లో చెలామణి అయి ఉండేదే కాదు. అందుచేత ఈ చట్టం గురించి యోచించేటప్పుడు లేక చర్చించేటప్పుడు, మిల్లత్‌తో దానికున్న ప్రత్యేక అనుబంధం ఏమిటో, ఈ చట్టానికి మూల సాధనాలయిన ముస్లిముల భావాలు, దృక్పథాలకు అది ఏ విధంగా అద్దం పడుతోందో పరిశోధించి నిర్ణయానికి రావటం ముఖ్యావసరమే కాదు అనివార్యం కూడాను. ముస్లిములు భౌగోళికంగానో, జాతి ప్రాతిపదికపైనో, భాషా ప్రధానంగానో లేక అలాంటివే ఇతర ఆధారాలుగానో ఉనికిలోకి వచ్చిన జాతి” ఎంత మాత్రం కాదు - అదొక ప్రత్యేకమయిన సైద్ధాంతిక సమాజం. స్తూత్రబద్ధమయిన సంఘం. ఈ యదార్థం దృష్ట్యా రెండు విషయాలకు ఆస్కారం
ఉంది. ముస్లిమ్ పర్సనల్ లాకు పునాది అయిన మున్లిమ్‌ల ప్రత్యేక స్వభావం, వారి భావాలు, భావనలు (1) కేవలం వారి జాతి జీవనపు ప్రత్యేక నాగరికత పరిస్థితులు, సామాజిక ప్రయోజనాల దృష్ట్యా ఉత్పన్నం కావడం, (2) ఇంకా ముందుకుపోయి అవి వారి సైద్ధాంతిక సూత్రప్రాయమయిన స్థాయికి నహజ పర్యవసానంగా ఉనికిలోకి రావడం.
ప్రపంచ చట్టాల నిధిలో ఈ రెండు రకాల వ్యక్తిగత చట్టాలు కానవస్తాయి. ఒక జాతి వ్యక్తిగత చట్టం మొదటి తరహాకు చెందినదయితే ఇంకొక జాతి చట్టం రెండో తరహాకు చెందినదై ఉంటుంది . ముస్లిమ్ పర్సనల్ లా ఈ రెంటిలో ఏ రకానికి చెందినదయినా వాటిలో ఎంతో వ్యత్యాసముంటుంది. మొదటి తరహా ప్రకారమైతే - ఈ శాసనం కేవలం ముస్లిముల జాతీయ ప్రత్యేకత, వారి సామాజిక వ్యక్తిత్వాల ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. అప్పుడు అది, ముస్లిములు తమ ఇష్ట పూర్వకంగా స్వయంగా నిర్మించుకున్న కొన్ని ఆచార సంప్రదాయాల సముదాయం మాత్రమే. ఆ కారణంగా అవి సాంప్రదాయకంగా వారి జీవన వ్యవస్థలో ఒక భాగమైపోయినై అని చెప్పవలసి ఉంటుంది. రెండవ తరహా ప్రకారమయితే - ఈ. చట్టం సరాసరి వారి విశ్వాసాలతో, జీవన నియమాలతో ముడివడి ఉంది. ఇంకా అది వారు విశ్వసించే ధర్మం, వారి షరీఅత్‌లోని ఒక భాగం అయిపోతుంది. ఆ ధర్మాన్ని , ఆ షరీఅత్‌ని సంపూర్ణంగా అనుసరించడమే వారు ముస్లిములు అవడానికి, ముస్లిములుగా మనడానికి ఆనవాలు. మరో మాటలో చెప్పాలంటే ఈ చట్టం అసలు వారిచేత నిర్మించబడినది కాదు, వారు స్వయంగా దానిచేత “నిర్మించబడినవారు'. . ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని గురించి ఒక అభిప్రాయానికి రావడానికిగాను దాని పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది. అయితే అసలిది ఏ తరహాకు చెందింది? మొదటి తరహాకా? రెండో తరహాకా? అనే ప్రశ్న ఉత్పన్నమయాక దాని పూర్వాపరాలను పరిశీలించడం మరింత అవశ్యమైపోయింది.
ఎందుకంటే, ఈ ప్రశ్నకు సమాధానం దొరకనంతవరకు, ఈ చట్టం నిజస్థాయి ఏమిటో నిర్ధారించుకోలేనంత వరకు దీని గురించి ఏ చర్చనూ,క్రొన
సాగించనేలేము. ఒకవేళ అలాగే గనక ఆ చర్చను మొదలెడితే అది పరిశోధ నాత్మకమూ అనిపించుకోదు, శాస్రీయమూ కాదు. పైగా అది వాస్తవికమయిందీ కాదు, నిజాయితీతో చేసిందీ కాజాలదు. అందుచేత తొలుత ఈ మౌలిక యదార్భాన్ని వెతికి, ఒక దృఢ అభిప్రాయానికి రావాలి. అప్పుడుగాని చర్చను సిసలయిన గాడిలో వేయలేము.
పరిశోధనకు సరయిన పద్ధతి
ఈ విషయంలో రెండు అభిప్రాయాలకు తావులేదు. హేతుబద్ధంగా దీన్ని పరిశోధించే సముచితమయిన, సరయిన పద్ధతి ఒక్కటే కాగలదు. అదేమంటే, ముస్లిములు తాము అవలంబిస్తున్న ధర్మాన్ని అధ్యయనం చేయాలి. దాని మూలాధారాలయిన ఖుర్‌ఆన్ మరియు మహాప్రవక్త (సఅసం) సంప్రదాయాన్ని క్షుణ్ణంగా పరిశోధించి, నేడు దేన్నయితే “ముస్లిమ్ పర్సనల్ లా' అని పిలుస్తున్నారో దాని ఉనికి వాటి పుటల్లో ఎక్కడయినా ఉందో లేదో చూడాలి. ఒకవేళ ఉంటే వ్ స్థాయిలో ఉంది? ఏ పాటి ప్రాముఖ్యతతో ఉంది? అనే దాన్ని పరికించాలి. ఈ పరిశోధనలో, ఒకవేళ ఖుర్‌ఆన్‌లోగానీ, హదీసులలోగాని ఈ చట్టం ప్రస్తావన ఎక్కడా కనబడకపోతే, ధార్మికంగా దానికంటూ ఏ స్థానమూలేదన్న విషయం _ విస్పష్టమైపోతుంది. ఇక దానికి ఏదయినా ప్రాముఖ్యత ఉంటే అది కేవలం జాతీయత దృష్ట్యానో, లేక సాంస్కృతికంగానో ఉందని భావించాలి. ఒకవేళ యదార్థం మరోలా ఉన్నట్లయితే దీని అసలు యదార్థం కూడా భిన్నంగానే ఉంటుంది. అప్పుడు ఈ చట్టానికున్న ధార్మిక స్థానాన్ని షరీఅల్ స్థాయిని ఒప్పు కోవటం తప్పనిసరి అవుతుంది.
ముస్లిం పర్సనల్ లా - నిరూపిత సత్యాలు
ఖుర్‌ఆన్, హదీసులను పరిశీలిస్తే స్పష్టమయినవీ, విభేదాలకు తావులేనివీ కొన్ని యదార్థాలు మన ముందుకు వస్తాయి. అవేమంటే:
10
1 ఓ ముఖ్య అధ్యాయం
మొదటి యదార్థం ఏమంటే ముస్లిముల కుటుంబ జీవితం, వారి వ్యక్తిగత వ్యవహారాల విషయంలో ఖుర్‌ఆన్ హదీసులలో ఆదేశాలు, ఉపదేశాలు ఉన్నాయి. ఉండటమేమిటీ ఎంతో విపులంగా ఉన్నాయి. కనుక వాటి "పేజీలను తిరగేస్తూ ఆయా ఆదేశాలను, ఉపదేశాలను పరిశీలిస్తూ ముందుకు సాగండి - నికాహ్, మహర్, మనోవర్తి, తలాక్, ఖులా, ఈలా, ఇద్దత్, వంశ నిర్ధారణ, వారసత్వం, వీలునామా, పిల్లల పెంపకం, కుటుంబ పోషణ, వక్ఫ్, హిబా - మొదలగు అంశాలలో ఏ ఒక్కదాన్నీ అవి స్పర్శించకుండా, మార్గదర్శక సూత్రాలు సూచించకుండా, నియమాలను నిర్భారించకుండా, శాసనాలను నిర్ణయించకుండా వదలివేయలేదన్న సంగతి మీకు సుబోధకమవుతుంది. ఇది ఎంత బహిరంగమయిన యదార్థమంటే దీనికి సంబంధించిన దైవగ్రంథ వాక్యాలను, మహాప్రవక్త (సఅసం) ప్రవచనాలను ఇక్కడ ఉటంకించవలసిన అవసరమే లేదు. ఎవరయినా ఈ లోతుల్లోకి పోదలిస్తే దివ్య ఖుర్‌ఆన్ అనువాదాన్ని చూసుకుంటే చాలు - దాన్ని ధృవపరచుకోగలడు.
యదార్థం ఇంతే కాదు, ఈ వ్యక్తిగత చట్టాలు ఖుర్‌ఆన్ - హదీసులలో ఉండటమే కాదు, అవి ఎంతో స్పష్టంగా కూడా ఉన్నాయి, మరెంతో విపులంగానూ ఉన్నాయి. దివ్య ఖుర్‌ఆన్‌లో ఇవి ఎంత విపులంగా వివరించబడ్డాయంటే, అంత చక్కని విపులీకరణ జీవితపు మరే రంగానికి సంబంధించిన ఆదేశాలలోనూ కానరాదు. ఆఖరికి నమాజ్, రోజా, జకాత్ వంటి మౌలిక ధార్మిక విషయాలు కూడా ఇంతగా విడమర్చి చెప్పబడలేదు. ఈ ఒక్క ఆధారం చాలు అందులో నిగూఢమయిన పరమార్థం ఉందనడానికి. ఈ పరమార్ధాన్ని నిర్ధారించే విషయంలో అనేక అభిప్రాయాలుంటే ఉండడం సాధ్యమే. కాని వ్యక్తిగత చట్టాల విషయమై అసాధారణ రీతిలో వివరాలు ఇవ్వటం ఖుర్‌ఆన్ దృష్టిలో వాటికున్న ప్రత్యేక ప్రాముఖ్యతకు ప్రతీక అనడంలో మాత్రం రెండు అభిప్రాయాలకు తావు లేదు.
11
11. దైవాదేశాలనడానికి నిదర్శనాలు
ఖుర్‌ఆన్, హదీసులలో ఏ ఆదేశానికి సంబంధించిన ప్రస్తావన అయినా వచ్చిందంటే దాన్ని పాటించడం ముస్లిములకు విధిగా నిర్ణయించబడిందన్న మాటే. ఆ విషయం గురించి ఇంకా వేరుగా విడమరచి చెప్పవలసిన అవసరమే లేదు. కాబట్టి ప్రస్తుత చర్చనీయోంశమైన వ్యక్తిగత చట్టాలు ఖుర్‌ఆన్ హదీసులలో ఉండగా, వాటిని అనుసరించడం కూడా తప్పనిసరి అనడంలో సందేహమే లేదు. అయితే ఖుర్‌ఆన్ సూత్రప్రాయమయిన ఈ యదార్థం దృష్ట్యా ఈ చట్టాలను కేవలం ఎరుకపరచడం మాత్రమే కాదు, దానితో పాటు అడుగడుగునా వాటిని విధిగా నిర్ణయించిన విషయాన్ని, అవి తప్పనిసరిగా అనుసరించవలసినవి అన్న విషయాన్ని స్పష్టంగా వివరిస్తూపోయింది కూడా. ఉదాహరణకు “నికాహ్ గురించి కొన్ని ఆదేశాలిచ్చిన తరువాత ఒక చోట ఇలా సెలవియ్యబడింది:
“అల్లాహ్ మీపై (ఈ చట్టాలను) విధిగా నిర్ణయించాడు” (నిసా - 24) మరో చోట ఏమనబడిందంటే:
“ఇది అల్లాహ్ ఆజ్ఞ. ఆయన మీ మధ్య తీర్పు చేస్తాడు.” (ముమ్తహినహ్ - 10)
ఇదే విధంగా తలాక్, ఖులా గురించి కొన్ని ఆదేశాలు వివరించి ఇలా హెచ్చరించబడింది -
“ఇవి అల్లాహ్ విధించిన వాద్దులు. వీటిని అతిక్రమించకండి” (అల్ బఖర - 229)
“ఇద్దతోకు సంబంధించిన కొన్ని మార్గదర్శక సూత్రాలు చెప్పిన తరువాత బాధ్యతను జ్ఞాపకం చేయడం జరిగింది: “ఇది అల్లాహ్ ఆజ్ఞ. దీన్ని ఆయన మీ వద్దకు వంపాడు” (తలాఖ్ - 5)
మరో చోట తలాక్ మరియు ఇద్దత్‌కు సంబంధించిన కొన్ని ఆదేశాలిచ్చి,
2
వాటిని అల్లాహ్ నిర్ణయించిన హద్దులుగా పేర్కొనడం జరిగింది.
“ఇవి అల్లావ్ నిర్ణయించిన హద్దులు ....... ” (తలాక్ -1)
ఇక వారసత్వపు చట్టాల విషయంలోనయితే ఈ విపులీకరణ అసాధారణ
రీతిలో ఉంది. అందుకే వాటిని గురించి చెప్పటం ప్రారంభించినప్పుడు పీఠికలోనే నిక్కచ్చిగా ఇలా చెప్పబడింది:
“తల్లి దండ్రులు, దగ్గరి బంధువులు విడిచి వెళ్ళిన ఆస్తిలో వురుషులకు భాగం ఉంది. అల్లి దండ్రులు, దగ్గరి బంధువులు విడిచివెళ్ళిన ఆస్తిలో స్రీలకు కూడా భాగం ఉంది - అది తక్కువయినా నరే, ఎక్కువయినా సరే. ఈ భాగం (అల్లాహ్‌చే) నిర్ణయించబడింది.” (అన్ నిసా -7)
ఇక అసలు చట్టాల ప్రస్తావన ఈ పదాలతో మొదలవుతుంది:
“అల్లాహ్ మీ సంతానం విషయంలో మీకు ఆదేశిస్తున్నాడు.....” (నిసా - 11)
ఆ తరువాత ఆ చట్టాలకు సంబంధించిన ఒక భాగం అవగానే;
“ఈ భాగాలను అల్లావ్ నిర్ణయించాడు. _నిళ్ళయంగా అల్లావా యదార్జాలన్లీ తెలిసినవాడు, మర్మహేతువులన్ఫీ ఎరిగినవాడు.” (నిసా - 11)
అని గుర్తుచేయటం జరిగింది.
ఇక ఈ ఆస్తి పంపకాల వివరణ ముగింపు కూడా ఏ పదాలతో జరిగిందో
గమనించండి:
'అల్లావా అన్నీ తెలిసినవాడు అత్యంత నహనశీలుడూను. ఇవి అల్లావా నిర్ణయించిన హద్దులు..... ” (నిసా - 12.13)
ఈ విధంగా ఈ వారసత్వ చట్టాల గురించి ఒకటి కాదు, రెండు కాదు
13
ఐదుసార్లు చెప్పటం జరిగింది. చెప్పిన విషయాన్ని మార్చి మార్చి కొత్త కొత్త రీతుల్లో నొక్కి పలకడం జరిగింది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన, మన కోసం తప్పనిసరి చేసిన చట్టాలన్న సంగతి మన మనోక్షేత్రంలో నాటడం జరిగింది.
దివ్య ఖుర్‌ఆన్ చేసిన ఈ స్పష్టీకరణ తరువోత కూడా, ఈ చట్టాలు ముస్లిములకు ఎప్పుడయినా అనవసరం కూడా కాగలవని, వీటిని మానవ నిర్మిత శాసనాల స్థాయిలో కూడా ఉంచవచ్చని ఎంత ఆసమంజసమయిన తర్కం ద్వారానయినా దీన్ని సమర్థించలేము.
I. ఇస్లామీయ విలువలు
మూడవ విషయం ఏమంటే ఈ చట్టాల్లో ఇస్లామ్ మౌలిక సూత్రాలు, ఆశయాలు అంతర్లీనంగా, వాటి రక్షక కవచంగా కూడా వ్యవహరిస్తాయి. ఇస్లామ్ ధర్మంలోని సారమే వాటికి ఊపిరిగా ఉపకరిస్తుంది. ఈ విధంగా అవి ముస్లిమ్‌ల వ్యక్తిగత జీవితపు వ్యవహారాలను క్రమబద్ధం చేసే సాధనాలే కావు, అవి వారిలో విశ్వాసం కోరే గుణాలను, ఇస్లామీయ విలువలను ప్రోది చేసేందుకు అవసరమయ్యే ఆధారం కూడాను. ఉదాహరణకు నికాహ్ విషయాన్నే తీసుకోండి. ఇస్లామ్ మౌలిక శాసనం ప్రకారం బహుదైవోపాసకునితో ఏకేశ్వరోపాసకుని వివాహం జరగటానికి వీల్లేదు. 'దానికి ఖుర్‌ఆన్ పేర్కొన్న కారణం ఏమిటంటే, అటువంటి వైవాహిక సంబంధం ముస్లిములను విశ్వాసం మరియు ఇస్లామ్ అనే సంపదకు పరలోక సాఫల్యానికి నోచుకోకుండా చేస్తుంది (అల్ బఖర - 227. విశ్వాన భాగ్యమే ఒక ముస్లిమ్‌కు అన్నింటికన్నా విలువయిన అభరణం గనుకను, పరలోక సాఫల్యమే అతని నిజ ధ్యేయం గనుకను, దాని పరిరక్షణ ఇస్లామ్‌లో ఓ మౌలిక సూత్రం కావడం తప్పనిసరి. దాని కోసం బహుదైవోపాసకులతో నికాహ్‌ను నిషిద్ధంగా ఖరారు చేయడం సముచితమే కాదు ఒక అనివార్య అవస రమ్లూ అయిపోయింది. ఇదే విధంగా ఇస్లామ్, న్యాయం చేయగలిగే పక్షంలో ఒకటి కంటే ఎక్కువ వివాహాలు చేసుకునేందుకు కూడా అనుమతిని ఇచ్చింది. దాని ద్వారాలను అది మూసివేయలేదు. ఈ అనుమతి కూడా అసంఖ్యాకమయిన
14
సామాజిక, నైతిక ప్రయోజనాలను, పరమార్థాలను దృష్టిలో ఉంచుకునే ఇవ్వబడిందని మరువరాదు. ముఖ్యంగా అనాధల హక్కులు, ప్రయోజనాలు ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. (నిసా: 3)
మరో దృష్టాంతం. - విడాకులనే తీసుకుందాం. ఇస్లామ్ దాంపత్య బంధాన్ని అన్నింటికన్నా ముఖ్యమయిన, గౌరవప్రదమయిన సంబంధంగా ఖరారు చేసినప్పటికీ, అది విడాకులు, వేర్పాటుకై అవకాశాన్ని కల్పించింది. ఇలా చేయడంలోని ప్రధాన ఉద్దేశ్యం, అనునిత్యం దైవాదేశాల ఉల్లంఘన జరగకుండా చూడటమేనని కూడా చెప్పబడింది (అల్ బఖర-229). ఆంటే పరస్పరం అయిష్టత ఏర్పడి, ద్వేషభావం పెరిగిన కారణంగా దాంపత్య జీవిత ధ్యేయం భార్యాభర్తలిద్దరి దృష్టికీ మరుగైనప్పుడు, ఇక వారిద్దరి మధ్య సఖ్యతకు, సర్దుబాటుకు అవకాశం లేదనుకున్నప్పుడు ఆ సంబంధాన్ని అలాగే కొనసాగించడం ఎంతకీ శ్రేయస్కరం కాదు. అలా కొనసాగనివ్వడం ఆ ఇరువురి నైతికత, నడవడికలను సతతం కళంకభూయిష్టం చెయ్యడమే. దైవం, పరస్పరం వారిద్దరిపై మోపిన హక్కులు బాధ్యతలను సర్వనాశనం చెయ్యడమే. అదే జరిగితే అది సమాజం పాలిట అభిశాపం అవుతుంది. బహిరంగ ఉపద్రవానికి దారితీస్తుంది. ఇస్లామ్, జీవితపు ఏ విభాగంలోనూ కలతను, ఉపద్రవాన్ని, అరాచకాన్ని సుతరామూ సహించదు. అందువల్లను, ఆ దంపతులు విడిపోలేనే గాని ఆ రగడకు నివారణ అసంభవమయినందువల్లనూ ఆ లక్ష్య సాధనకై ఇక వారిద్దరూ ఉత్తమ రీతిలో వేరుపడటానికి అనుమతి ఇవ్వటమే మేలని ఇస్లామ్ భావిస్తోంది.
ఈ కొన్ని ఉదాహరణల ద్వారా - ఇస్లామ్ వ్యక్తిగత చట్టాలు కేవలం చట్టాలే కావని, అవి ఇస్లామ్ ఆశయాలు, ప్రమాణాలను సాధించేవి అనే విషయం కూడా సులభంగా ద్యోతకమవుతుంది.
1౪. విశ్వాసానికి మోక్షానికి షరతు ఖుర్‌ఆన్ ఉపదేశాల ద్వారా విస్పష్టమయ్యే నాల్గవ యదార్థం ఎమంటే, ఈ చట్టాలను అమలు జరపడం విశ్వాసానికి తప్పనిసరి పర్యవసానమని, పరలోక
15
సాఫల్యానికి మూలాధారమని తెలుస్తోంది. ఇదొక షరతు. ఈ యదార్భాన్ని ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం అసలు లేకుండింది. _ ఎందుకంటే దైవ, గ్రంథం, దైవ ప్రవక్త (సఅసం) ప్రవచనాలలో అవి ప్రస్తావించబడ్డాయి. ఆ. ప్రస్తావనే చాలు, ముస్లిమయిన ఒక వ్యక్తి వాటిని ఆచరించడం తప్పనిసరి అని, అది అతని ధర్మం మరియు విశ్వాసాల అనివార్యమయిన పర్యవసానమని చాట డానికి. అయినప్పటికీ కొందరు ఈ విషయంలో మొండి ధోరణిని అవలంబించి “ఒక చట్టం ఖుర్‌ఆన్‌లో ప్రస్తావించబడినంత మాత్రాన, అల్లాహ్ నిర్ణయించినదిగా చెప్పబడినంత మాత్రాన అది కచ్చితంగా ధార్మిక ప్రతిపత్తి కలిగి ఉండనవసరం లేదు, షరీఅత్‌లో భాగమూ కానవసరం లేదు, అది ప్రాపంచిక చట్టమూ కావచ్చు. ధార్మిక ప్రాముఖ్యతలేని చట్టమూ కావచ్చు. ఇక ఏ ఖుర్‌ఆన్ ఆదేశం. ధార్మిక మయింది, ఏది ప్రాపంచికమైంది అనేది దానితో సంబంధమున్న వ్యవహారాన్ని బట్టి నిర్థారించవలసి ఉంటుంది. వ్యక్తిగత చట్టాలతో సంబంధం కలిగి వున్న వ్యవహారాలు స్వచ్చంగా ప్రాపంచికమయినవి అయినందున వాటిని కూడా ప్రాపంచికమయినవిగా భావించడానికి కనీసపు అవకాశమయితే ఉండనే ఉంది" అని వారు వితండవాదం చేస్తారు.” అందుచేత ఈ ఆదేశాల గురించి ఖుర్‌ఆన్ చేసిన వివరణను కూడా గమనించటం అవసరం. అదేమంటే, ఇవి ఎటువంటి ఆదేశాలంటే విశ్వాసులయిన వారు వాటిని విధిగా పాటించాలి. వాటిని
* ఇదేదో ఊహాజనిత విషయం కాదు. యదార్ధ విషయమే. డాక్టర్ గజేంద్ర గడ్కర్ వంటి మేధావి “భారత దేళ సమైక్యత” అనే అంశంపై ఉవన్యనిన్తూ, ముస్లిమ్ వర్గం కొరకు సెక్యులరిజం చూపే బాటేమిటంటే, కామన్ సివిల్‌కోడ్ విషయంగానీ, బహు భార్యత్వాన్సి నిషేధించే విషయంగానీ ఖుర్‌ఆన్ ఆధారంగా కాదు, సామాజిక ప్రాతిపదికల ఆధారంగానే వరిశీలిం చడం జరగాలి అని ఘంటావథంగా అన్నాడు. (ఖభామీ ఆవాజ్ : 16-12-1970)
అలాగే ప్రాఫెనర్ ఫైజి (దురదృష్టవశాత్తు ఇతనూ ముస్లిమ్ పర్సనల్ లాలో ఆరితేరిన నివుణుడుగా వరిగణించబడుతున్నాడు) ఓ సారి ప్రనంగిన్తూ ఇలా అభిప్రాయపడ్డాడు - “పవిత్ర ఖుర్‌ఆన్ వాదోవవాదాలకు అతీతమయిన దైవవాణి.
16
పాటించడం దైవ భక్తికి అనివార్య పర్యవసానం. వాటిని అతిక్రమించడం, అధర్మం, అన్యాయం, పాతకం, దైవధిక్కారం, దేవుని శిక్షకు పాత్రమయిన నేరం “అవుతుంది. అందుకే వారసత్వపు చట్టాలను గురించి పేర్కొన్న తరువాత సెలవియ్యబడింది : “ఇవి అల్లాహ్ విధించిన హద్దులు. అల్లాహ్‌కు ఆయన ప్రవక్తకు ఎవ డయితే విధేయత చూవుతాడో అతణ్ణి అల్లాహ్, క్రింద సెలయేర్లు ప్రవహించే ఉద్యానవనాల్లోకి ప్రవేశింపజేస్తాడు, ఆ వనాల్లో అతడు కలకాలం ఉంటాడు. అసలు ఇదే గొవ్చ సాఫల్యం. ఎవడైతే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతాడో, అల్లాహ్ విధించిన వాద్దుల్తి అతిక్రమిస్తాడో, అతణ్ణి అల్లాహ్ అగ్బిలో వడవేస్తాడు. అందులో అతను నదా ఉంటాడు. అతనికి తీవ అవమానంతో కూడుకున్హ శిక్ష వడుతుంది.” (అన్ నిసా -13, 14) ఖుర్‌ఆన్ ఇచ్చిన ఈ వారసత్వపు ఆదేశాలను సక్రమంగా అనుసరిస్తే పర లోకపు శాశ్వత సాఫల్యం లభిస్తుందని, వాటిని అతిక్రమిస్తే శాశ్వత నిష్ఫలత ప్రాప్తి స్తుందన్న సంగతి పై దైవోపదేశం ద్వారా స్పష్టంగా బహిర్గతమవుతూనే ఉంది.
ఇదే విధంగా విడాకులకు సంబంధించిన కొన్ని ఆజ్ఞలు ఇచ్చిన తరువాత ఇలా అనబడింది :
అయితే అందులో వున్న కొని విషయాలను మార్చి వేయవలసిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకు - బహుభార్యత్వం, వరదా తలాక్”
(స్టేట్స్‌మన్ (ఢిల్లీ) - మొదటి పేజీ, 8వ కాలమ్ తేదీ 11-8-1970) ఒకవైవు ఏదేని ఆదేశాన్ని అది ఖుర్‌ఆన్‌లో ఉందని ఒప్పుకుంటూనే, మరోవైపు దాన్ని ఉపేక్షించతగిందిగా, మార్చ దగిందిగా నిర్హ్ణయించడం అంటే అర్థమేమిటీ? ఆ ఆదేశం ఖుర్‌ఆన్‌లోనిదే అయినప్పటికీ అది ధర్మానికీ, విశ్వాసానికీ సంబంధించింది కాదని భావించినప్పుడే అలా చెప్పడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా దాన్ఫి వవిత్రమయిందిగా దానితో వాదించడంగాని, విభేదించడం గాని తగని దైవ గ్రంథమని ఒవ్పుకున్నప్పుడు ఈ భావం మరింతగా బలపడుతుంది.
17
“మీరు నిజంగా అల్లావాను అంతిమ దినాన్సి విళ్ళుసించిన వారే అయితే, అలా ఎంత మాత్రం చెయ్యకూడదని మీకు బోధించబడులోంది. ” (అల్ బఖర - 232)
ఒక వ్యక్తి విశ్వాసి అవడానికీ, అతను ఈ ఆదేశాలను నిర్వర్తించటానికీ ఖుర్‌ఆన్ దృష్టిలో అవినాభావ సంబంధం ఉందని తెలుస్తోంది. ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా ముస్లిమ్ అయి ఉండి ఈ ఆజ్ఞలను త్రోసిరాజనడం అనేది అసంభవం.
ముజాదిలా సూరాలో 'జిహారోో గురించిన ఆదేశాలు ఇవ్వబడిన తరువాత, దాని ప్రాముఖ్యతను ఎలా నొక్కిచెప్పటం జరిగిందో చూడండి:
“(ఈ ఆదేశాలు ఎందుకు ఇవ్వుబడినాయంటే) వీటి ద్వారా మీరు అల్లావొను, ఆయన ప్రవక్తను ' విళ్ళనించేవారుగా అవుతారని. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. వీటిని ధిక్కరించే వారికి వ్యధాభరిత మయిన శిక్ష ఉంటుంది.” (ముజాదిలహ్ : 4) “
“ధిక్కరించే వారికి వ్యధాభరితమయిన శిక్ష ఉంటుంది” అనే వాక్యం ఈ సందర్భంలో రావడాన్ని బట్టి, పైన ప్రస్తావించబడిన జిహార్ ఆజ్ఞల్ని త్రోసిపుచ్చిన తరువాత ఏ వ్యక్తీ విశ్వాస పరిధిలో ఉండలేదన్నది ఖుర్‌ఆన్ ఉద్దేశ్యం అని లేటతెల్లమయిపోయింది. గ
తాకాలని టల వము.
* 'జివోర్ (Zihar) అంటే ఆగ్రహావేళంలో భర్త భార్యత్తో నిన్ను ముట్టను పో' అని ప్రకటించటం లేక భార్యను వారామ్ (నిషిద్ధం) అయిన బంధుత్వం గల స్త్రీగా చెప్పడం, ప్రకటించడం అని అర్థం. అలా చేసిన వారు, తమ ఈ తొందరపాటు చేష్టకి పరిహారంగా ఒక బానినను న్వతంత్రుడ్డి చేయడం గానీ, లోక 60 రోజులు ఉపవానం పాటించడం గానీ లేక 60 మంది నిరుపేదలకు ఒక రోజు అన్హ్రం పెట్టడంగానీ చేయనంతవరకు తమ భార్యతో నమాగమం చేయరాదన్సది దైవాజ్ఞ.
18
ధర్మంలో భాగమనడానికి స్పష్టమైన తార్కాణం
ఇస్లామ్ వ్యక్తిగత చట్టాలను గురించి ఖుర్‌ఆన్ వివరించిన ఈ నాలుగు యదార్థాలను - అవి నిజానికి ఒకదానితో మరొకటి పెనవేసుకుని ఉన్న యదార్థాలు, వాటిలో ఏ ఒక్కటి అల్లాహ్, ఆయన ప్రవక్త ప్రవచనంలో ఉన్నా, మిగిలిన మూడు కూడా ఉండటం అనివార్యం - ముందుంచుకుని ఈ చట్టాలు ఇస్లామ్ ధర్మంలో భాగం అవునో కాదో మీరే నిర్ణయించండి. ఈ ప్రశ్నకు “కాదు' అని సమాధానమివ్వడం అటు బుద్ధికీ సాధ్యపడదు, ఇటు శాస్త్రీయ నిజాయితికీ సంభవం కాదని నిశ్చయంగా చెప్పవచ్చు. ఒకవేళ అలా చేస్తే అది కళ్ళారా చూసిన దాన్నే లేదన్నట్లు అవుతుంది. ఇటువంటి స్పష్టమయిన సాక్ష్యాలుండగా బుద్ధిగల ప్రతి వ్యక్తి ఈ చట్టాలు ఖుర్‌ఆన్, హదీసుల్లో అంతర్భాగమని, ఖుర్‌ఆన్‌లోని మరే భాగమయినా ఎంత ముఖ్యమయిందో అంతే ముఖ్యమయిన భాగమని ఒప్పుకుని తీరాడు. ఈ ఆదేశాలు దీన్ మరియు షరీఅత్‌లోని ఓ భాగమే అని, దాన్ని ఎప్పటికీ వాటి నుండి వేరు చేయటానికి వీల్లేదని, అది లేకుండా ఇస్లామీయ ధర్మానికి ఓ రూపమే రాదని అంగీకరిస్తాడు.
ఇక ఏ ఆదేశాలు, ఏ నియమాలయితే దైవ వచనంలో స్పష్టంగా ప్రస్తావించబడ్డాయో, ఏ ఆదేశాలయితే మరింత వివరంగా మహాప్రవక్త ప్రబోధన ల్లోనూ లభిస్తాయో, వేటినయితే దివ్యఖుర్‌ఆన్ “అల్లాహ్ హద్దులు” అని నిర్థారిం చిందో, వేటినైతే అల్లాహ్ తరపున మోపబడిన విధులు అని, ఆదేశాలని చెప్పడం జరిగిందో, మరింకా ఖుర్‌ఆన్ ఇచ్చిన ఏ ఆదేశాలయితే కేవలం ఆదేశాలు మాత్రమే గాక వాటిలో ఖుర్‌ఆన్ మౌలిక సూత్రాలు, ఆశయాలు, నైతిక విలువలు నిబిడీకృతమై ఉన్నవో, ఇంకా వేటి అవలంబననయితే విశ్వాసానికి, తప్పనిసరయి నదిగా, మోక్షానికి మూలాధారంగా పేర్కొనడం జరిగిందో - అటువంటి ఆదేశాలు, నిర్దేశాలను కూడా అవి ధర్మంలో భాగం కాదు పొమ్మంటే, ఇక ధర్మమంటే,ఇస్లామ్ అంటే అర్థమే ఏముంది? ఆ( ఎవరయినా అసలు ఈ రకమయిన చట్టాలు దీన్ మరియు షరీఅత్‌లో భాగమే కాకూడదని, మానవ నాగరికత మరియు సామాజిక జీవితంలో ఖుర్‌ఆన్, సున్నత్‌లకు పొత్తు ఉంచాల్సిందే కాదు అనే ప్రశ్నను లేవ
19
నెత్తితే అది వేరే విషయం. అటువంటి వ్యక్తి ఇంకా ముందుకు పోయి అసలీ ఖుర్‌ఆన్ సున్నత్‌లే ఆసాంతం స్వీకారయోగ్యం కానివి అని చెప్పినా చెప్పివేయవచ్చు. ఆ వ్యక్తి ధర్మాన్ని త్రోసిరాజన్నాడని అనుకొని సరిపెట్టుకోవచ్చు. అయితే ఫలానా ఆదేశాలు ఖుర్‌ఆన్‌లో ఉన్న విషయం నిజమే, వాటిని ఆచరించటం తప్పనిసరిగా పేర్కొన్న సంగతీ నిజమే. వాటిని విశ్వాసానికి, మోక్షానికి మూలాధారాలుగా ఖరారు చేసిన మాటా వాస్తవమే అయినప్పటికీ ధార్మికంగా వాటికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు అని బుకాయించే హక్కు మాత్రం అతనికి లేదు. ఇది ఒకే సమ యంలో పగలు ఉందని ఒప్పుకుంటూనే సూర్యుడు లేడు పామ్మనే వితండవాదం లాంటిదే.
“ముస్లిం” కాదు “ఇస్లామిక్ లా”
ముస్లిమ్ పర్సనల్ లా అనబడే ఈ ఆదేశాలు వాస్తవానికి ధర్మంలోని ఒక భాగమేననీ, ఇతర జాతులు స్వయాన నిర్మించుకున్న తమ వ్యక్తిగత చట్టాలకు ఇవి పూర్తిగా భిన్నమయినవన్న యదార్థం నిరూపితం అయిన తరువాత కూడా వీటిని “ముస్లిమ్ పర్సనల్ లా' అనే అనడం వాస్తవం యొక్క తప్పుడు నిర్వచనం కాకపోయినా అసంబద్ధమయిందనడంలో మటుకు సందేహం లేదు. ఇవి “ముస్లిమ్' చట్టాలు కావు, ఇస్లామిక్ చట్టాలు అన్న సంగతిని మీరు వెనుకటి పంక్తుల ద్వారా తెలుసుకున్నారు. అవి ముస్లిమ్‌ల మేధ నుండి పుట్టినవి కావు. వారి బుద్ధీ వివేకాల, ఇష్టాయిష్టాల ప్రమేయం వాటిలో ఏ మాత్రం లేదు. వాటి ఆవిర్భావానికి మూలం ఖుర్‌ఆన్ సున్నత్‌లే. కనుక వాటిని “ముస్లిమ్ పర్సనల్ లా' అనే పేరుతో స్మరించడం అంటే బుద్ధి పూర్వకంగానో, లేక యాదృచ్చికంగానో వాటి నిజస్థాయిపై ముసుగువేయడమే అవుతుంది. వాటికివ్వబడిన ఈ పేరు కూడా వాస్తవానికి ఆంగ్లేయుల హయాంనాటి అశుభమయిన “కానుకే. ఆ కాలంలో ముస్లిముల సంస్కృతిని, వారి ధర్మాన్ని గాయపరచడానికి, ధార్మిక భావనను రూపుమాపడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతుండేవి. ఈ ఇస్లామ్ వ్యతిరేక లేక ఇస్లామ్ పట్ల అవగాహనాశూన్యమయిన ఆలోచనా తీరు మూలంగానే
20
ఖుర్‌ఆన్ మరియు ఇస్లామ్ ఆదేశాలను 'ఖురానిక్ లా' అని, “ఇస్లామిక్ లా' అని అనడానికి బదులు 'ముహమ్మడెన్ లా' అని నిర్వచించడం జరిగింది. న్యాయశాస్త్ర గ్రంథాలలో, న్యాయస్థానాలలో అది రివాజు అయిపోయింది. ఆ పదం అందరి | నోటిలో నానేలా చేయడం జరిగింది. అది నిజమయిందిగా, వాస్తవానికనుగుణంగా ఉండటంలో ఎలాంటి సందేహమే లేనంతగా ప్రచారం జరిగింది. మరి ఆ తరువాత దాని పర్యవసానంగానే ముస్లిముల వ్యక్తిగత జీవితంతో ముడిపడి ఉన్న షరీఅత్ ఆదేశాలను “ముస్లిమ్ పర్సనల్ లా' అని నామకరణం చేయడం జరి గింది. నిజానికి అది “ముస్లిమ్ లా' కాదు, ఇస్లామిక్ లా'. అందుచేత నిజాయితీ, యదార్థ ప్రియత్వం కోరేదేమంటే ఈ ఆదేశాలను వాటి అసలయిన పేరుతోనే గుర్తించాలి. ఇది కేవలం యదార్థ ప్రియత్వమే కాదు, నేటి ఆవశ్యకత కూడా.
నేడు ఇస్లామ్ గురించిన అవగాహనా రాహిత్యం ఎంత అధికమయిందంటే విద్యావంతులనబడేవారు సయితం “ఇస్లామ్” మరియు 'ముస్లిమి'ల మధ్య తేడాను గమనించలేక పోతున్నారు. ఈ పరిస్థితులలో “ముస్లిమ్ పర్సనల్ లా'అనే ప్రయోగం ఇలాగే కొనసాగితే సహజ పరిణామంగా, కొంత. కాలం తరువాత షరీఅత్ ఆదేశాల నిజ స్వరూపమే సామాన్య జనానికి కనబడకుండా పోతుంది. ఇదయితే ముస్లిమ్ పర్సనల్ లా మాత్రమేనని, దీనికి ఇస్లామ్‌తో ఎట్టి సంబంధం లేదని, దీని సంబంధమంతా కేవలం ముస్లిములతోనే ఉందని, ప్రపంచంలోని ఎన్నో జాతుల వ్యక్తిగత చట్టాలు ఏ విధంగానయితే ఆయా జాతులు మతాన్ని వదలిపెట్టి కేవలం నాగరికత ఆధారంగా సంకలనం చెయ్యబడ్డాయో అదే విధంగా ముస్లిములనబడే ఒక జాతి నాగరిక అవసరాలకు కల్పించబడ్డ చట్టాలే ఇవి అని ప్రజలు తలపోసేందుకు ఆస్కారముంది. చెప్పండి! ఇంత పెద్ద మౌలికమయిన అపార్థాన్ని అలాగే మిగల్బడం, దాన్ని పెంచి పోషిస్తూ ఉండటం న్యాయమా? సమంజసమా?
ధర్మంలో భాగం అవడానికి కారణం ముందుకు సాగే ముందు కాస్త ఆగి, ఇస్లామీయ శిక్షణల పరిధి కుటుంబం
లై
సామాజిక విషయాల వరకు విస్తరించడానికి కారణమేమిటో కూడా అర్థం చేసు కోవడం సబబు. ఆ మూల కారణం, ఖుర్‌ఆన్ ప్రతిపాదించే అల్లాహ్, దీన్ (ధర్మం) ఇబాదత్ (ఆరాధన) అనే విషయాలకు సంబంధించిన మౌలిక భావనలలో కానవస్తుంది. ఈ భావన కాక మరే భావననయినా ఈ విషయాలకు ఆపాదించి నట్లయితే అది ఖుర్‌ఆన్ దృష్టిలో అసంపూర్ణం, దోషభూయిష్టం, అజ్ఞానభరితంగానే పరిగణించబడుతుంది. ఆ మౌలిక భావనల వివరణ క్లుప్తంగా ఇది:
దేవుడు యావత్తు విశ్వ వ్యవస్థకు సృష్టికర్త ఆయన సమస్త జీవరాసులకు పోషణకర్త, ప్రభుత, న్యాయం, వివేచన, కారుణ్యం, శక్తి, ఆధిపత్యం, సర్వజ్ఞత - ఇత్యాది ఉత్తమ గుణగణాలన్నీ ఇతోధిక పరిపూర్ణతతో ఆయనకే సొంతం. ఆయన ఏ విధంగా సర్వ సృష్టికి కర్తయో, పోషణ కర్తయో అదే విధంగా ఆయన దాని సంచాలకుడు, నిర్వాహకుడూను. యజమాని, స్వామి కూడా. సర్వాధికారి, శాసననిర్మాత, శాసన ప్రదాత, ఆరాధ్యుడు, పూజనీయుడు కూడాను. మరే ఇతరుడూ ఆయనలోని ఈ గుణగణాలలో, ఈ హోదాలలో, ఆయన అధికారాలలో, హక్కులలో ఇసుమంత కూడా భాగస్వామ్యం కలిగిలేడు. అందుకే ఉపాసనకూ, విధేయతకు ఆయనే అర్హుడు - నిర్షిబంధమయిన విధేయతకు - అర్హుడు కూడా ఆయనే.
మనిషికి రుజుమార్గం చూపడానికి, సత్యబాటపై అతన్ని నడిపించి నిజసాఫల్య గమ్యం వరకు చేర్చడానికిగాను దైవం అనుగ్రహించిన మార్గదర్శకత్వం, అంటే ఆదేశాలు చట్టాల సముదాయమే దీన్ (ధర్మం). దేవుడు న్యాయశీలుడు, వివేచనాపరుడు, పరిపోషకుడు, పరిపాలనాధికారి, సార్వభౌముడు అయిన కారణంగా ఇది ఆయన బాధ్యత. మనిషి భౌతికావసరాల కోసం అన్నపానీయాలను సమకూర్చినట్లే అతని ఆధ్యాత్మిక నైతిక అవసరాల కోనం సాధనాసంపత్తిని సమకూర్చవలసిన భారం కూడా ఆయనపై ఉండింది. లేకపోతే ఆయన పోషణ కరృత్వం అసంపూర్ణమవుతుంది, ఆయన న్యాయశీలత విఫలమైపోతుంది, ఆయన వివేచన నిస్సారం అనిపించుకుంటుంది. ఆయన సార్వభౌమాధికారం అర్థంలేని దనిపించుకుంటుంది. మరో మాటలో చెప్పాలంటే అట్టి పరిస్థితుల్లో దేవుడు దేవుడని పిలిపించుకోడానికే అర్హుడు కాడు.
22
మరో వైపు మనిషికి అతని జీవిత పరమార్థమేమిట్కో ఆ పరమార్థం సిద్ధికై మార్గం ఏమిటో తెలుపవలసిన అవసరం కూడా ఉండింది. అతనికి తన ప్రభువు అభీష్టం ఏమిటో, తన నిజ పాలకుని ఆదేశాలేమిటో ఎరుకపరచవలసి ఉండింది. ఈ జ్ఞానం మార్గదర్శకత్వంలోనే అతడు తన కోనం ఆలోచన ఆచరణల రుజు మార్గాన్ని పొందగలుగుతాడు, ఊహాకల్పనల చీకట్లలో తచ్చాడకుండా ఉండ గలుగుతాడు. ఇదీ దీన్ (ధర్మం) ఉద్దేశ్యం, ఆశయం కావడంచేత, అది మనిషి మొత్తం నైతిక జీవనానికే ఆవశ్యమయింది. అది దేవుని పోషణ, పాలనా గుణాల పర్యవసానం కావడం వల్ల అది మనిషి జీవన వ్యవస్థకు సంబంధించిన అన్ని రంగాలను పరివేష్టించింది. ఏ విభాగం మరే రంగం కూడా దాని పరిధికి పూర్తిగా ఆవల లేదు. ఎందుకంటే మనిషి జీవితపు ఏ వ్యవహారం కూడా నైతిక కోణం, మంచి చెడుల చర్చ తలెత్తకుండా కానరాదు. అందుచేత ధర్మం, అంటే దైవ మార్గదర్శకత్వం కూడా ఏ వ్యవహారాన్ని ఉ పేక్షించకుండా ఉండడం, మరే జీవన విభాగమూ దాని మార్గదర్శకత్వం లేకుండా ఉండడం అత్యవసరమయింది. ఈ కారణంగానే దేవుని ఈ అంతిమ ధర్మం - ఇస్లామ్ - ఒక్కొక్కటి చొప్పున జీవితపు సమస్యలన్నింటినీ చర్చిస్తోంది. ఆరాధనాలయం నుండి సామూహిక జీవితపు ఆఖరి అంచు వరకు అన్ని విషయాలకు సంబంధించిన నిర్దేశాలనూ ఇస్తుంది. ఈ సమస్త ఆదేశాల సముదాయానికే దీన్ (ధర్మం) అని పేరు. ఈ సముదాయంలోని ప్రతి ఒక్క అంశమూ సమంగా ధర్మంలోని అంతర్భాగమే.
ఇస్లామ్‌లో ఆరాధన అంటే అర్థం కేవలం పూజా పురస్కారాలే కాదు - అది అంతకన్నా విసృతమయింది. దైవోపాసన, దైవ సంస్మరణ అనేవి నిస్సందేహంగా ఆరాధనకు ఊపిరే. అయితే అవీ సంపూర్ణ ఆరాధనలు కావు. మరి సంపూర్ణ ఆరాధన అంటే ఏమిటి? దైవం పంపిన ధర్మాన్ని పూర్తిగా అవలంబించటం, ఎటు వంటి భేదం, విభజన పాటించకుండా చిత్తశుద్ధితో, సంకల్ప నిరతితో, మనస్ఫూర్తిగా వినయ వినమ్రతలతో దైవధర్మాన్ని పాటించడం అన్నమాట. ఇంతకు ముందు తెలుపబడినట్లు దైవం పంపిన ఈ ధర్మం ఓ సమగ్ర మార్గదర్శకత్వం కావటం మూలంగా, ఇంకా అది మొత్తం మానవ జీవితాన్ని విస్తరించి ఉండటం మూలంగా,
23
ఆ మార్గదర్శకత్వంలోని ఒక్కో అక్షరాన్ని గట్టిగా పట్టుకోనంత వరకు, యావజ్జీవితాన్ని దానికి అప్పజెప్పనంత వరకు దైవారాధన ఏ మాత్రం నెరవేరదు.
ఇవీ, ఖుర్‌ఆన్ మరియు ఇస్లామ్ దృష్టిలో దైవం, దైవ ధర్మం, ఆరాధనలకు నంబంధించిన సరైన భావనలు. అలాంటప్పుడు, మనిషి వ్యక్తిగత జీవితంతో ముడిపడి వున్న వ్యవహారాలతో వాటికి సంబంధమే లేకపోవడమనేది ఎలా సంభవం? ఒకవేళ ఉన్నా అది ధర్మం, ఆరాధన, దైవభక్తులతో అవినాభావ సంబంధమున్న అంశం కాకపోవడం అనేది ఎలా సాధ్యం? కుటుంబం, సామా జిక వ్యవహారాలు కూడా ఈ మానవ జీవితంలోని అంతర్భాగమేగా; ఆంతేకాదు, అవి అత్యంత ముఖ్యమైన, అన్ని పరిస్థితుల్లోనూ అనివార్యమైన అంతర్భాగమే. మరి అటువంటప్పుడు వాటిని దైవధర్మం ఎలా విస్మరించివదలివేయగలదు? వాటి విషయంలో మార్గదర్శకత్వం ఇవ్వకుండా ఎలా ఊరుకోగలదు? సత్యం, న్యాయం; రుజువర్తనలు కోరేదేమిటో తెలుపకుండా ఎలా ఉండగలదు? లేక ఈ విషయాల్లో అది (దైవధర్మం) ఇచ్చిన ఆదేశాలకు ఎలాంటి ధార్మిక ప్రాధాన్యత లేకుండా పోతుందా? వాటికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేకుండా ఎలా వీలవుతుంది? విశ్వాసి లేక ముస్లిమ్ అనే వారిపై వాటిని అనుసరించటమో లేక అనుసరించకపోవటమో ప్రభావం వేయకుండా ఎలా ఉంటుంది?
ఎవరి దృష్టిలోనయిలే దైవం, ధర్మం, ఆరాధనలకు సంబంధించిన భావనలు వేరయినవో - నిస్సందేహంగా ఇలాంటి వారే అధిక సంఖ్యలో వున్నారు- అటువంటి వారికి ఇస్లామ్ వ్యక్తిగత చట్టాల ధార్మిక స్థితిని అర్థం చేసుకోవడం, దాన్ని సముచితమయినదిగా, సమంజసమయినదిగా ఒప్పుకోవడమన్నది చాలా కష్టం. అయితే ఇక్కడ జరుగుతున్న చర్చ ఉచితానుచితాలను గురించి ఏ మాత్రం కాదు. ఇది వాస్తవం అవునా కాదా అన్న విషయం గురించి. వాస్తవం మటుకు స్పష్టంగా ఒక్కటే - అయితే ఈ శాసనాలు ధార్మిక (దీన్ని ఎవరూ కాదనలేరు) ప్రతిపత్తిని కలిగి వున్నాయని, అవి ధర్మంలోని ఓ భాగమని, ఇలా ఉండటం ఖుర్‌ఆన్ తెలిపే ధార్మిక భావన, దైవ భావనల దృష్ట్యా ఎంతైనా అవసరమని చెప్పడమే వాస్తవం.
24
ముస్లిం సమాజం, సంస్కృతుల రీత్యా...
ముస్లిముల వ్యక్తిగత చట్టాల నిజస్థితి ఏమిటో, వాటి మౌలిక ప్రాధాన్యత ఏమిటో పై చర్చ ద్వారా సుస్పష్టమయ్యింది. ఈ విషయంలో ఇంకా ఇతరత్రా చర్చించవలసిన అవసరం లేదు. అయితే పరిస్థితుల దృష్ట్యా ఈ చట్టాల నిర్ధారిత స్థితిని అంటే ధార్మిక స్థితిని మాత్రమే గాక సాంస్కృతికంగా, ముస్లిం సమాజం పరంగా కూడా దాని విలువను తెలుసుకోవలసిన అవసరమెంతైనా ఉంది. తద్వారా ఎవరయితే ఏదో ఒక కారణం చేత ఈ చట్టాల ధార్మిక స్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారో వారు సయితం, ముస్లిములు తమ పర్సనల్ లాను ప్రాణ ప్రదంగా రక్షించుకుంటున్నారంటే నిజంగా వారలా చెయ్యడం ఎంత అవసరమో అన్న సంగతిని తెలుసుకోగలుగుతారు.
ఒకవేళ ముస్లిముల సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలను గనక దృష్టిలో ఉంచుకుని ముస్లిమ్ వ్యక్తిగత చట్టాలను పరిశీలించినట్లయితే వాటి ప్రాముఖ్యతకు సంబంధించి క్రింద పేర్కొన్న పలు కోణాలు ముందుకు వస్తాయి.
పర్సనల్ లా మిల్లత్ వ్యక్తిత్వానికి ప్రతిరూపం
మొదటి విషయం ఏమంటే, ఒక సజీవ శరీరానికి దాని నాడీ మండలం ఎంతగా అవసరమో, ముస్లిమ్ వ్యక్తిగత చట్టాలు ముస్లిముల సామాజిక వ్యక్తిత్వానికీ, ప్రత్యేకతకు అంలే అవసరం. ఈ వాదనలోని సత్యాన్ని గ్రహించడానికి సమాజాలు సాంస్కృతిక వర్గాల ఉనికి వాటి నిర్మాణం గురించి వివరంగా యోచించండి. ఏ వ్యక్తుల సమూహాన్నయినా ఇతర వ్యక్తులు, ఇతర వర్గాల నుండి వేరుపరచి, వారిని ఓ విలక్షణమయిన వ్యక్తిత్వం గల వర్గంగా, ఓ ప్రత్యేక సమాజంగా తయారు చేసే విశేష అంశాలేవో కాస్త ఆలోచించండి. ఈ ఆలోచన, అనుశీలనల ద్వారా మీకు ఒక విషయం తెలిసివస్తుంది. ఈ వ్యవహారంలో మొట్టమొదటి ప్రాముఖ్యత మౌలిక విశ్వాసాలు భావనలకు ఉన్నప్పటికీ, ఇంకా అవే మిల్లత్ (సమాజం) వ్యక్తిత్వానికి వాస్తవ పెన్నిధి అయినప్పటికీ, మిల్లత్‌లోని వ్యక్తులు మనుగడ సాగించడానికి ఆధారభూతమయ్యే, నిర్దేశాలు, నియమాలు, జీవన
25
రీతులు, ఆచారాల పాత్ర కూడా ఇందులో ఏమాత్రం తక్కువ కాదు. ఎందువల్లనంటే ఈ విశ్వాసాలు, ఆలోచనలు కళ్ళకు కనిపించే పదార్థాలు కావు - మిల్లత్ వ్యక్తి త్వాన్ని వ్యక్తం చేసే, ప్రత్యేకతను ప్రన్ఫుటం చేసే సంకేతాలుగా రూపొందటానికి! క్రియాత్మకంగా మిల్లత్ లేక సమాజం ప్రత్యేకతలకు ఆనవాళ్ళుగా, బాహ్యంలో కనిపించే దాని పద్ధతులు నియమాలు మాత్రమే అలరారుతాయి, అలరారగలవు కూడా. ఆ మిల్లత్ లేక సమాజం వాటిని తన విశ్వాసాలు, బాహ్యాలు సిద్ధాంతాల కనుగుణంగానే స్వీకరిస్తుంది. వాటి కనుగుణంగా దాని జీవితానికి సంబంధించిన సమస్త వ్యవహారాలు సాగుతూ ఉంటాయి. ఇంకా ఈ చట్టాలు, నియమాలకు చెందిన భిన్న విభాగాలు జాతి క్రియాత్మక అవసరాలతో, దాని సాధారణ జీవితంతో ఆచరణాత్మక సంబంధం దృష్ట్యా సమానం కాజాలవు. అందుచేత దాని (అంటే ఆ జాతి లేక సమాజం) వ్యక్తిత్వ రూప కల్పనలోనూ వాటి ప్రమేయం సమానంగా ఉండకపోవచ్చు.
సమాజంలోని వ్యక్తుల జీవితంతో ప చట్టాలు ఎంత ఎక్కువ సంబంధం కలిగి ఉంటాయో అవి ఆ సమాజ నిర్మాణంలోనూ అంతే ఎక్కువ ప్రమేయం కలిగి ఉంటాయి. ఈ కోణంలో చూసినపుడు వ్యక్తిగత చట్టాలకు ఉన్న స్థానం ఎంత విశిష్టమయిందో ప్రతి వ్యక్తికీ తెలిసిన విషయమే. శిశువుకు పాలు పట్టడం, పిల్లల పెంపకం, హిజానత్, కుటుంబపోషణ, నికాహ్ (వివాహం), మహర్, మనోవర్తి, దాంపత్య హక్కులూ, బాధ్యతలు, తలాక్, ఖులా, ఫిస్కె నికాహ్ (మూడూ విడాకుల రూపాలు), వారసత్వం, వీలునామా మొదలగునవి ఎటువంటి సమస్యలు, వ్యవహారాలంటే వాటి క్రియాత్మక సంబంధం ప్రజలందరితోనూ ఉంటుంది. దాదాపు ప్రతి వ్యక్తి జీవితం చుట్టూ. ఇవి పరివేష్టించి ఉంటాయి. కాగా వ్యక్తి యొక్క ఇతర జీవిత సమస్యల క్రియాత్మక సంబంధంపై వాటిని పోల్చి చూస్తే పరిమిత వ్యక్తుల వరకు, పరిమిత పరిమాణంలో ఉంటుంది. అందుచేత జీవన వ్యవహారాలను క్రమబద్ధం చేసే పైన ప్రస్తావించిన చట్టాల సామాజిక ప్రాధాన్యత కూడా ఎంతో అధికంగా ప్రస్ఫుటంగా ఉండటమనేది సహజమయిన విషయం. ఇంకా మిల్లత్ వ్యక్తిత్వం, ప్రత్యేకత ఈ చట్టాలపై ఆధారపడినంతగా
26
ఇతర చట్టాలపై ఏ మాత్రం ఆధారపడి ఉండదు. సాధారణ పరిస్థితుల్లో అసలు ఈ చట్టాలు మాత్రమే మిల్లత్ వ్యక్తిత్వానికయినా, దాని ప్రత్యేక ప్రతిపత్తికయినా ప్రతిబింబిస్తాయి అని చెపితే తప్పుకాదు. ఈ ఒక్క రూపమే ఈ ప్రత్యేకతలకు ఆశ్రయమిచ్చేది. దీని ద్వారానే వీటిని గుర్తించడం జరుగుతుంది. ఇదే అసలు దాని ఉనికికి, మనుగడలకు ఆయుఃపట్టు వంటిది.
ముస్లిమ్ సమాజం ప్రత్యేకతల పరిరక్షణ
మరో విషయమేమంటే ఈ వ్యక్తిగత చట్టాలు వాస్తవానికి ముస్లిమ్ సమా జం ప్రత్యేకతల్ని సయితం పరిరక్షిస్తున్నాయి. సమాజాల ఉత్థాన పతనాల గురించి నిశితంగా పరిశీలిస్తే ప్రతి సమాజంలోని నమ్మకాలు, ఆలోచనా విధానం, ఆచార నియమాల మనుగడ దాని వ్యక్తిగత చట్టాలతో ముడివడి ఉంటుంది. వాటి ఆధారంగానే ఆ సమాజ నిర్మాణమవుతుంది. ఈ చట్టాలు ఆ సమాజానికి మూలం కాకపోయినప్పటికీ అనివార్యంగా అవి ఆధారాలుగా అలరారుతాయి.
వ్యక్తిగత చట్టాలకు నమాజానికి గల సామ్యం ఓ వృక్షం లాంటిది. దాని
వ్రేళ్ళ నుండే పుట్టిన కొమ్మలు, రెమ్మలు, ఆకులు పచ్చగా కళకళలాడుతూ ఉండా లంటే, వాటికి అవసరమయిన ఆహారాన్ని వ్రేళ్ళే అందజేస్తాయి. కాని ఆ వ్రేళ్ళు కూడా తమ జీవనానికి కొమ్మలపై, ఆకులపై ఆధారపడతాయి. వ్రేళ్ళు కనుక ఎండిపోతే ఆకులు, కొమ్మలు తమ జీవాన్ని కోల్పోతాయి. అలాగే ఆకులు, కొమ్మలు, రెమ్మలు కోల్పోయిన చెట్టు వ్రేళ్ళు సయితం ఎండిపోయి కృశించిపోతాయి. . అదే విధంగా సమాజాలలోని మౌలిక ఆలోచనలు, భావాలు, నమ్మకాలు, వాటి ఆచరణాత్మక స్వరూపాలు జీవితంలో నక్రమంగా అమలులోకి వచ్చినంత కాలం, ఆ సమాజపు ఆలోచనల్లో, భావాల్లో జీవం, శక్తి కానవస్తాయి. ఈ క్రియా త్మక రూపాలు జీవనరంగం నుండి మాయమవగానే భావాలు, నమ్మకాలు కూడా బలహీనమయి క్రమేణ నిర్జీవమయిపోతాయి. ఒక జాతి జీవితంలో ఆచరించే సకల నియమాల ద్వారా దాని మౌలిక భావనలు వ్యక్తమయినా నిజానికి వ్యక్తిగత చట్టాల ఆచరణాత్మక ప్రాముఖ్యం అన్నింటినీ మించినదై ఉంటుంది. అందువల్ల
27
వ్యక్తిగత చట్టాలను అమలుపరచడం లేక పరచకపోవడం అన్న దాని ప్రభావం ఆ జాతి మౌలిక నమ్మకాలపై స్పష్టంగా కానవస్తుంది.
ఈ వ్యక్తిగత చట్టాలపై దృఢంగా నిలిచి ఉన్న పక్షంలో సమాజపు నమ్మకాలు, ఆలోచనలతో దాని సంబంధాలు పటిష్టమవుతాయి. ఆచరణా బంధాలు తెగి పోతే మూలాలతో ఆ సమాజ సంబంధాలు బలహీనపడి క్రమేణ సమసిపోతాయి. ఎందుకంటే వ్యక్తిగత చట్టాలను తృణీకరించడమంటే, ఆ చట్టాలు ఇక ఆ జాతి దృష్టిలో అసమంజసమయినవని, స్వీకారయోగ్యం కావని నిర్ణయించుకోవటమన్నమాట. సమాజపు మౌలిక ఆలోచనలూ, భావనల ఆధారంగా జన్మనెత్తిన వ్యక్తిగత చట్టాలను కాదనడమంటే, దాని మౌలిక ఆలోచనల, నమ్మకాల సామంజస్యాన్నే ప్రశ్చించడమన్నమాట. తన మూలాల పట్ల దాని ఈ విశ్వాసరాహిత్యాన్ని ఆ జాతి స్వయంగా గుర్తించకపోవడం అన్నది వేరే విషయం.
ఈ మానసిక పరివర్తన అక్కడే ఆగిపోదు. ఇంకా ముందుకు పోతుంది. సమాజం తన మౌలిక విశ్వాసాలను, ఆలోచనా విధానాన్ని వదులుకోవడంతో ఆగక ఇతర ఆలోచనా విధానాలు, విశ్వాసాలతో ప్రభావితం అవుతుంది. ఎందుకంటే ఆచరణాత్మకంగా తన వ్యక్తిగత చట్టాలతో సంబంధాన్ని తెంచుకున్న సమాజం వాటి స్థానే వేరే చట్టాలను అనుసరించక తప్పదు. ఆ ఇతర చట్టాలు, ఇతర సమాజాల ఆ సిద్ధాంతాలు, విశ్వాసాల పై ఆధారపడి ఉంటాయి. ఆ చట్టాలను సమాజంలో అమలుపరచడం వల్ల ఆయా ఇతర సమాజాల ఆలోచనలు, నమ్మకాల పట్ల ఆకర్షణ పెరుగుతుంది. తన వ్యక్తిగత చట్టాలను వదులుకున్న సమాజానికి తన వ్యక్తిగత ప్రత్యేకతల పట్ల స్పృహ ఉండదు. అందువల్ల ఇతర సిద్ధాంతాల దాడిని ఎదుర్కోవడం పట్ల అంత ఆసక్తి చూపదు. : చివరకు ఆ సమాజం తన మౌలిక విశ్వాసాలు, సిద్ధాంతాల పునాదులు కదిలిపోతాయి. తన విశ్వాసాలు, సిద్ధాంతాలలో మార్పులు చేర్పులు చేయడానికి ఆ సమాజం సిద్ధపడిపోతుంది. అందువల్ల ప్రతి సమాజంలోని పర్సనల్ లా ఆ సమాజపు ప్రత్యేకతను మాత్రమే కాదు, అది దాన్ని పరిరక్షిస్తుంది కూడా.
అనేక జాతుల, సమాజాల చరిత్రలు ఈ వాస్తవాన్నే చాటుతున్నాయి.
28
పర్సనల్ లా లేకపోతే సమాజ ప్రత్యేకత నశిస్తుంది
- ఇంకో విషయమేమంటే, తన పర్సనల్ లాను కోల్పోయిన తరువాత ఆ సమాజం ప్రత్యేకత కూడా మిగలదు. ఎందుకంటే, జాతి యొక్క ప్రత్యేకతలను ప్రతిబింబించే పర్సనల్ లా ఆ జాతి యొక్క ఉనికిని పరిరక్షించే పర్సనల్ లాను కోల్పోయిన తరువాత ఆ జాతి తన ఉనికిని నిలుపుకోవడం అసాధ్యం. పర్సనల్ లాను కోల్పోవడమంటే ఆ జాతి తన వ్యక్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయిందన్న మాట. ఎందుకంటే, ఆ జాతి పర్సనల్ లాను రద్దు చేసి, ఆ జాతి యొక్క ప్రత్యేకతలను చెరిపివేసి, ఆ జాతిని మరో మూసలో పోసి ఆఖరుకు ఈ విధంగా ఆ జాతిని పరకాయ ప్రవేశం గావించిన కారణంగా ఆ జాతి మౌలిక విశ్వాసాలు సయితం కదలిపోయినప్పుడు ఇక ఆ జాతి సజీవంగా ఉండడం సాధ్యమా? ఈ పెను మార్పుల తరువాత మరో జాతి ఛత్ర ఛాయల్లోకి చేరి అందులో లీనమయిపోవడమే ఆ జాతికున్న ఏకైక భవిష్యత్తు. ఆ జాతి లేదు, ఆ సమాజంలోని వ్యక్తులు అస్సలు ఉండరని కాదు అర్థం. వ్యక్తులు ఉంటారు. అంతే కాదు, వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి సాధించి అత్యున్నత స్థాయిని చేరుకొనీ ఉండవచ్చు. కాని జాతి ప్రత్యేకతలు లేని వ్యక్తుల్ని సమాజమనరు. ఇలాంటి లక్షల, కోట్ల మంది వ్యక్తులున్నప్పటికీ ఆ జాతి' గతించిన ఓ చారిత్రక గాథలా మారిపోతుంది.
పర్సనల్ లా రద్దు, ఓ ప్రమాదకరమైన చర్య
జాతులు, సమాజాల పర్సనల్ లాకు ఉన్న అసాధారణ ప్రాముఖ్యత ఇది. ఈ కారణంగానే ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఏ మాత్రమయినా ఉన్న జాతులు తమ వ్యక్తిగత చట్టాలను ప్రాణప్రదంగా భావిస్తాయి. ఎట్టి పరిస్థితులు ఎదురయినప్పటికీ పర్సనల్ లాను కాపాడుకోవాలనుకుంటాయి. పర్సనల్ లాతో సమాజానికి సైద్ధాంతిక సంబంధం ఎలాగూ ఉంటుంది. దానితోపాటు భావపరమైన, ఉద్విగ్నతతో కూడుకున్న బంధమూ ఉంటుంది. భావపరమైన ప్రగాఢ సంబంధమున్న విషయంలో వ్యక్తులు భావుకులయిపోతారు, వారి భావాలు ఆతి సున్నితమయిపోతాయి. దాని గౌరవం మంటగలిస్తే వారు భరించలేరు. మరే
29
విషయం కోల్పోయినా సహిస్తారేమోగాని, తాము ఎంతో అభిమానించే అంశాన్ని వదలుకోవడం వారు ఆలోచించనూలేరు. అందువల్లనే చరిత్రలో పెద్ద పెద్ద మహా సామ్రాజ్యాలు తమ అధీనంలోని జాతుల సర్వస్వాన్ని దోచుకోగలిగారుగాని వాళ్ళ వ్యక్తిగత చట్టాల జోలికి పోలేదు. రోమన్ ఎంపైర్, బ్రిటన్ సామ్రాజ్యం అందుకు మంచి ఉదాహరణ. ఆంగ్లేయులు భారత దేశంపై ఆధిపత్యాన్ని పొందిన తరువాత, అప్పటి వరకు అమలులో ఉన్న సాధారణ ఇస్లామీయ చట్టాలను తొలగించి వాటి స్థానే తమ చట్టాలను ప్రవేశపెట్టారు. కాని, ఇక్కడి పౌరుల పర్సనల్ లా కు సంబంధించినంత వరకు వాటిని ముట్టుకోలేదు. అందు కారణం ఒక్కటే, ఇక్కడి ముస్లిములకు, హిందువులకు తమ తమ వ్యక్తిగత చట్టాల పట్ల అత్యంత అభిమానముండి, ఆ చట్టాల కోసం వాళ్ళు తమ ప్రాణాలనైనా నవ్వుతూ అర్పిస్తారు. తమ చట్టాలను రద్దు చేయడాన్ని మాత్రం సహించరు. అందువల్ల సున్నితమయిన అంశాన్ని కదపటం ప్రమాదకరం.
నేటి వరకు యదార్ధంగా నిరూపితమయిన విషయం ఒక్కసారిగా అవాస్తవికం అయిపోదు. పర్సనల్ లా కు గల ఈ సాంస్కృతిక ప్రాధాన్యత ఇతర జాతులు, సమాజాల మాదిరిగానే ఇస్లామీయ సమాజంలోనూ ఉందన్న విషయాన్ని కాదనలేము. ముస్లిమ్ పర్సనల్ లా ఇస్థామీయ సమాజానికి స్వరూపంగా, దాని సోమూహిక వ్యవస్థకు రక్షణ కవచంగా పని చేస్తుంది. ఈ పర్సనల్ లాను కోల్పో వడం ముస్లిముల సామాజిక ప్రత్యేకతల సర్వనాశనంగా తేలుతుంది. అందువల్ల ముస్లిమ్‌ల పర్సనల్ లా వారి విశ్వాసాలతో ముడివడి ఉండకపోయినా వారికి అది తమ ప్రాణం కన్నా ఏ మాత్రం తక్కువగా ప్రేమ పాత్రమై ఉండేది కాదు.
ముస్తిం పర్సనల్ లా యూణుఖథంం నిఖిల్ కోడ్ - షమ్స్ పీర్గాద
31
ముస్లిమ్ పర్సనల్ లా అంటే ఏమిటి?
భారతదేశంలో ముస్లిమ్ పర్సనల్ లా చరిత్ర క్లుప్తంగా ఇది: మొగల్ చక్రవర్తుల హయాంలో ఇస్లామ్ చట్టం రాజ్య శాసనం (Law of the Land) గా ఉండేది. అంటే సివిల్ చట్టమే గాక, క్రిమినల్ చట్టం (Crna L2w) కూడా ఇస్లామ్ శాసనాల పరిధిలోనే ఉండేది. వీటి ప్రకారమే న్యాయ వ్యవస్థ నడపబడేది. అయితే వివాహాది విషయాలు, వారసత్వం, ఆస్తిపాస్తులు తదితర వ్యవహారాలలో ముస్లిమేతరులకు తమ మత ధర్మాల ప్రకారం, సాంప్రదాయక నియమాల ప్రకారం అనుసరించే నంపూర్ణ స్వేచ్చ ఉండేది. అంటే ఒక విధంగా వారి కోసం వారి పర్సనల్ లా ఉండేది. ముస్లిముల కోసం ముస్లిముల పర్సనల్ లా ఉండేది. క్రీ.శ. 1765లో ఈస్టిండియా కంపెనీ భారత న్యాయస్థానాలను పునర్వ్యవస్థీకరించిన తరువాత న్యాయవేత్తల సహకారంతో ఇంగ్లీషు న్యాయ మూర్తులు ఇస్లామీయ శాసనాల కనుగుణంగా తీర్పులు ఇచ్చేవారు. ఆ పిదప క్రమ క్రమంగా ఇంగ్లీషు చట్టాలు ప్రవేశపెట్టసాగారు. క్రీ.శ. 1862 నాటికల్లా ఇస్లామ్ క్రిమినల్ లాను పూర్తిగా రూపుమాపి దాని స్థానంలో ఇండియన్ పీనల్ కోడ్ (Indian Penal Code) విధించటం జరిగింది. నేటికీ అది ఆ పేరుతోనే వ్యవహరించబడుతున్నది. దీనిద్వారా ఇస్లామ్ చట్టాన్ని నికాహ్ (పెళ్ళి) తలాక్ (విడాకులు), హిబా (దానం), వారసత్వం మొదలైన కుటుంబ మరియు వ్యక్తిగత వ్యవహారాలకు మాత్రమే పరిమితం చేయటం జరిగింది.* అయితే ముస్లిమేతర సంస్కృతీ ప్రభావం వల్ల ముస్లిములలోని కొన్ని వర్గాలలో ఇస్లామ్ శాసనాల స్థానే సాంప్రదాయక చట్టాలు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు, హైందవ సంస్కృతీ ప్రభావంతో స్రీలకు ఆస్తిలో హక్కు ఇవ్వబడేది కాదు. అందుచేత ముస్లిమ్ మేధావుల, సామాన్య ముస్లిముల కోరికపై ఆంగ్లేయుల పరిపాలనా కాలం (1937)లో ముస్లిమ్ పర్సనల్ లా (Muslim Personal Law - Shariat -Application Act 1937) ప్రవేశపెట్టబడింది.
* చూడండి Chamber's Encyclopeadia Vol. ix P.468.
92
ముస్లిమ్ పర్సనల్ లాలో దీనికిగల మరో పేరు “షరీఅత్ యాక్ట్ (చట్టం)- 1937” ఇందులో ఏమని ఉందంటే దావేదారులు (వ్యాజ్యకారులు) ముస్లిములు అయిన పక్షంలో వివాహం, మహర్, మనోవర్తి, తలాక్, ఖులా, నికాహ్ రద్దు, విలాయత్, హిబా, వారసత్వం, వక్ఫ్ - ఇత్యాది విషయాలలో నిర్ణాయక శాసనం (Ruleof Decision) ముస్లిమ్ పర్సనల్ లా (షరీఅత్) ప్రకారమే ఉంటుంది అని.
దీని తరువాత క్రీ.శ. 1939లో వీగిపోయిన ముస్లిముల వివాహ రద్దు చట్టం (Dissolution of Muslim Marriages Act : 1939) ఒకటి ప్రవేశ పెట్టబడింది. ఆ చట్టంలో - ఒక ముస్లిమ్ మహిళ తన భర్త నుండి విడిపోదలిస్తే, ఆ మేరకు ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కావలసిన కారణాలను (౮70263) నిర్ణయించ బడ్డాయి. ఉదాహరణకు, భర్త గనక నాలుగేళ్ళ నుండి చెప్పా పెట్టకుండా ఎక్కడిక యినా వెళ్ళిపోవడమో లేదా అతను తనపై దౌర్జన్యానికి, వేధింపుకు వడిగడుతుం డటమో చేస్తే లేదా భర్త సుఖవ్యాధులకో, దీర్ధకాలిక వ్యాధులకో గురై ఉంటే నికాహ్ రద్దు విషయమయి ఆమె కోర్టు నుండి ఉత్తర్వు (D607౭8)ను పొందగలదు.
దీని ద్వారా అవగతమయ్యేదేమిటంటే ముస్లిమ్ పర్సనల్ లా కేవలం నికాహ్, తలాక్, ఖులా, వారసత్వం మొదలగు షరీఅత్ ఆదేశాలతో మాత్రమే ముడిపడిలేదు - దాని పరిధి అంతకన్నా విసృతమయినది. కేవలం నికాహ్ మరియు విడాకుల నిబంధనావళి మాత్రమే కాక, మొత్తం వారసత్వ వ్యవస్థ కూడా అందులోకి వచ్చేస్తుంది. ఈ వ్యవహారాలకు సంబంధించిన ఏ అంశం వివాదాస్పదంగా ఖరారైనా న్యాయస్థానం దాని తీర్పును షరీఅత్ చట్టం ప్రకారం ఇవ్వటానికి నిబద్ధమయి ఉంది. ఉదాహరణకు, ఏ స్తీ అయినా తన భర్త వేధిం పుకు విసుగెత్తిపోయి అతన్నుండి విడిపోదలిస్తే, మరోవంక భర్త అందుకు అంగీ కారం తెలుపకపోతే అట్టి పరిస్థితిలో ఆ స్రీ ధర్మాసనం ద్వారా నికాహ్ ఒప్పందాన్ని రద్దు చేయించగలదు. లేదా ఇస్లామ్ నిర్ణయించిన వారసత్వపు హక్కును భర్త ఇవ్వకపోయినా సరే ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించి తన హక్కును సాధించగలదు.
ముస్లిమ్ పర్సనల్ లా క్రోడీకరణ (Codification) అంటూ జరగకపోయి నప్పటికీ సూత్రప్రాయంగా షరీఅత్‌కు గల ప్రామాణికతను ఒప్పుకోవటం వల్ల ఇస్లామీ ఫికహ్ (ఇస్లాం ధర్మశాగ్రం)కు చట్టస్థాయి ప్రాప్తించింది. పైగా న్యాయస్థానాల సౌకర్యార్థం ఆంగ్లంలో “ముహమ్మడెన్ లా” పేరుతో అనేక గ్రంథాలు వెలువడ్డాయి. ఉదాహరణకు, ముల్లా రచించిన “ప్రిన్సిపుల్స్ ఆఫ్ ముహమ్మడెన్ లా” (PrINCiples of Mohammadan Law) ఎ.ఎ. ఫైజీ వ్రాసిన “బెట్ లైన్స్ ఆఫ్ ముహమ్మడెన్ లా” (Outlines of Mohammadan Law) ఎన్నదగినది. హనఫీ ఫికహ్‌కు సంబంధించిన ప్రామాణిక గ్రంథం “హిదాయ” ఆంగ్లానువాదం కూడా అచ్చయింది. దాన్ని ప్రమాణంగా తీసుకుని న్యాయవాదులు న్యాయస్థానాల్లో తీర్పులు కోర్తారు. న్యాయస్థానాలు కూడా ఇస్లామీయ ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు ఇవ్వవలసి ఉంటుంది. స్వాతంత్ర్యం తరువాత కూడా ఈ పరిస్థితి కొనసాగింది. దైవ కృప వల్ల ఇప్పటికీ ఈ స్థితే దాదాపు కొనసాగుతోంది. కాకపోతే కొన్ని పాక్షిక విషయాలలో ప్రస్తుత న్యాయస్థానాల ద్వారా ఇస్లామ్ శాసనాల ఉద్దేశ్యం నెరవేరటం లేదనేది వేరే విషయం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ విషయమై ఇంతకన్నా ఎక్కువ ఆశలు పెట్టుకోనూలేము.
ముస్లిం పర్సనల్ లా ప్రాముఖ్యత
నికాహ్, తలాక్, ఖులా మరియు వారసత్వం-ఇవేవో ఆల్లాటప్పా విషయాలు కావు. ఈ వ్యవహారాల్లో అడ్డదారులు తొక్కి, తన మనోవాంఛల కనుగుణంగా శాసనాలను రూపొందించేందుకు ఇస్లామ్ ఎవరికీ స్వేచ్ళనివ్వదు. పైగా ఇందలి ఒక్కొక్క విషయంపై స్పష్టమైన ఖుర్‌ఆన్ ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాల ప్రస్తా వన వచ్చినప్పుడల్లా వాటిని తు.చ. తప్పకుండా పాటించవలసి ఉందని కూడా నొక్కి చెప్పటం జరిగింది. వాటి ఉల్లంఘనకు ఒడిగట్టే వారిని గట్టిగా హెచ్చరించ టం కూడా జరిగింది. ఉదాహరణకు నికాహ్ (వివాహం)కు సంబంధించిన ఆదే శాలు వివరించిన వెంటనే ఖుర్‌ఆన్‌లో “ఇది అల్లాహ్ శాసనం. దీనికి మీరు
34
విధిగా కట్టుబడి ఉండాలి” (నిసా: 24) అని సెలవీయబడింది. అలాగే తలాక్, ఖులాల గురించిన ఆదేశాలు వివరించిన తరువాత “ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. కాబట్టి వీటిని ఉల్లంఘించకండి. మరెవరు అల్లాహ్ హద్దులను ఉల్లంఘిస్తారో వాడు తమ న్వయానికే అన్యాయం చేనుకున్సవారవుతారు ” (అల్ బఖర: 229) అని చెప్పటం జరిగింది. వారసత్వ నియమాలను గురించి చెబుతూ “ఇది అల్లాహ్ తరపున విధించబడిన భాగాలు” (అన్ నిసా:11) అని చెప్పబడింది. ఇకపోతే, వారసత్వ వ్యవస్థ గురించి చేసిన ఉపదేశాల ముగింపు క్రింది వచనంతో జరిగింది:
“ఎవడయితే అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూవుతాడో అల్లాహ్ నిర్ణయించిన వాద్దుల్లి అతిక్రమిస్తాడో అతణ్ణి అల్లాహ్ అగ్మిలో వడవేస్తాడు. అందులో అతను కలకాలం ఉంటాడు. అతనికి తీవ్ర అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది.” (అన్ నిసా : 14)
దివ్య ఖుర్‌ఆన్‌లోని సమాజపరమయిన ఆదేశాలను దైవ ప్రవక్త (సఅసం) విడమరచి చెప్పారు. అవి “సున్నత్‌గా వ్యవహరించబడతాయి. ముస్లిమ్ సమాజంలోని ప్రముఖ ధర్మశాస్త్రవేత్తలు (పుకహాలు) ఖుర్‌ఆన్, హదీసుల వెలుగులో పరిశోధన జరిపి - ధర్మశాస్త అన్వయింపుపై ఒక నిర్థారణకు వచ్చి -ఇస్లామీ ఫికహ్‌ను సంకలనం చేశారు. సమాజం మరియు కుటుంబ జీవితంతో ముడిపడి ఉన్న ఖుర్‌ఆన్, హదీసుల ఆదేశాలు ఇస్లామ్ షరీఅత్ యొక్క అతి ముఖ్యమైన భాగాలుగా పరిగణించబడతాయి. - ఇంకా వాటికి దైవ శాసనాల, దేవుని ఉత్తర్వుల స్థాయి ఉంటుంది. షరీఅత్ యొక్క సంపూర్ణ విధేయత గురించి దివ్య ఖుర్‌ఆన్‌లో ఆదేశాలు వచ్చాయి - 1. “విళ్ళసించినవారలారా! మీరు వూర్తిగా ఇస్లామలో ప్రవేశించండి.” (ఆల్ బఖర: 208)
2. “బ్రజలారా! ఏదయితే మీ ప్రభువు తరవు నుండి మీపై అవతరింపజెయ్య
35
బడిందో, దాన్ఫి అనునరించండి. మీ ప్రభువును త్రోసిరాజని ఇతర నం రక్షకుల్తి అనునరించకండి.” (ఆరాఫ్:3)
a “(ఓ ప్రవక్తా!) మీరు అల్లాహ్ అవతరింవజేనిన శాననం ప్రకారం ప్రజల వ్యవహారాలను పరిష్కరించండి; వారి కోరికల్తి అనుసరించకండి. మిమ్ముల్సి మీరు మోసంలో పడవేసి, అల్లాహ్ మీ వద్దకు వంపిన జ్ఞానమార్గానికి విముఖులు చెయ్యకండా మీరు అప్రమత్తులయి ఉండండి.”
(అల్ మూయిద: 49)
దైవాదేశాలు, దైవ శాసనాలుండగా తనకు నచ్చిన చట్టాలను నిర్మించుకునే
అధికారం, తన మనసు మెచ్చిన విధానాన్ని అవలంబించే అధికారం ఏ ముస్లిమ్‌కూ లేదు:
“విశ్వాసి అయిన ఏ వురుషనికిగాని, విశ్చుసించిన మరే స్తీకిగాని అల్లాహ్
మరియు ఆయన ్రవక్త విషయనిర్ణయం చేసివేసిన తరువాత తమ
న్వవిషయంలో ఎలాంటి అధికారమూ ఉండదు.” _ (అహ్‌జాబ్ : 36)
దైవ శాసనానికనుగుణంగా నిర్ణయాలు చేయనివారు ధిక్కారులు, స్వయం కృతాపరాధులు, అవిధేయులు అనబడతారు. అలాగే ధర్మంలోని ఒక అంశాన్ని గ్రహించి మరో అంశాన్ని విడనాడటాన్ని అత్యంత ఆక్షేపణీయమయినదిగా పరిగ ణీంచి ఇలా మందలించటం జరిగింది: “మీరు దైవ గ్రంథంలోని ఒక భాగాన్ని విళ్ళనించి మరొక భాగాన్ని తిరస్క రిస్తారా?” (అల్ బఖర: 85) నిసా సూరాలో సామాజిక కట్టుబాట్ల గురించి విపులంగా వచ్చింది. ఆ సూరాలోనే అంతిమ దైవ ప్రవక్త (సఅసం)ను bia పరమ ప్రభువు ఎంతో స్పష్టంగా సెలవిచ్చాడు:
“(ఓ ముహమ్మద్!) నీ ప్రభువు సాక్షిగా! వారు తమ పరస్పర విభేదాల్లో
36
నిన్సు న్యాయ నిర్ణేతగా స్వీకరించనంత వరకు, ఇంకా నీవు ఏ నిర్ణయం చేసినా దాన్ని గురించి వారి మనస్సుల్లో ఏమాత్రం సంకోచం లేకుండా దాన్సి నంవూర్ధంగా శిరసావహించనంత వరకు వారు ఎిళ్ళనించిన వారు కాలేరు.” (అన్ నిసా: 65)
ముస్లిమ్ పర్సనల్ లాను వ్యతిరేకిస్తున్నవారు అనేదేమిటంటే; ముస్లిమ్ పర్సనల్ లా షరీఅత్‌లోని భాగమయినంత మాత్రాన దాని నిర్మూలన పట్ల ఎవరూ కళవళపడనవసరం లేదు. ఎందుచేతనంటే ఇస్లామ్ క్రిమినల్ చట్టం (Criminal 12%) కూడా షరీఅత్‌లోని ఒక భాగమైనప్పటికీ ఇంతకు ముందు దాన్ని రద్దు పరచటం జరిగింది. ప్రస్తుతం దేశంలో ఇస్లామేతర క్రిమినల్ శాసనమే అమలులో ఉంది. అటువంటప్పుడు ముస్లిమ్ పర్సనల్ లా మార్పు పట్ల హైరాన పడవలసిన అవసరం ఏమిటి?- ఇది కూడా వింత వాదనే. ఒక వ్యక్తి గత్యంతరం లేక దుర్గంధ భరితమయిన వాతావరణంలో గాలి పీలుస్తున్నాడనుకోండి,అతనికి లభ్యమయ్యే స్వచ్చమయిన వాయువు మార్గాలను కూడా మూసివేసి కేవలం దుర్గంధభరితమైన వాయువునే అతని కోసం వదలాలనడం భావ్యమేనా? అది న్యాయమేనా?? , ఇస్లామ్‌కు చెందిన ఏ శాసనమయినా - అది క్రిమినల్ అయినా, సివిల్ అయినా, మరేదయినా - అది తన స్థానంలో పూర్తి ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంకా దాని శాసనాలన్నీ సరిసమానంగా గౌరవించదగినవే. ఏ షరీఅల్ చట్టాన్నయినా సరే రూపుమాపే ఆలోచన ఒక ముస్లిమ్ మనసులో మెదలనే జాలదు. అయితే దురదృష్టవశాత్తు క్లిష్ట పరిస్థితులు ఆసన్నమయి, కాలపు ఏలికలెవరయినా ఇస్లామ్ క్రిమినల్ చట్టం బదులు మరే చట్టాన్నయినా రుద్దారే అనుకోండి - దాన్ని ఆసరాగా చేసుకుని మిగిలి ఉన్న ఇస్లామ్ చట్టాలకు కూడా చెల్లు చీటి ఇవ్వాల నడం ఎంత వరకు సమంజసం?
మరి క్రిమినల్ చట్టాలకీ - సివిల్ చట్టాలకీ మధ్యనున్న తేడా పాడాలను ఈ ప్రబుద్ధులు బొత్తిగా విస్మరించి రెంటినీ ఒకే గాట కట్టేస్తున్నారు. క్రిమినల్ చట్టాల
37
సంబంధం చాలా వరకు ప్రభుత్వంతోనూ, పరిపాలనా యంత్రాంగంతోనూ ఉంటుంది. ఉదాహరణకు, ఒక దొంగకైనా, వ్యభిచారికైనా శిక్ష విధించేది ప్రభుత్వమే గాని వ్యక్తులు కాదు, అయితే సమాజపరమయిన చట్టాలను, కట్టుబాట్లను వ్యక్తులు తమకు తాముగా అవలంబించవలసి ఉంటుంది. వాటితో ప్రభుత్వానికి గల సంబంధం నామమాత్రమయినది. అంటే కేసుల పరిష్కారానికి సంబంధించినంత వరకే ప్రభుత్వ జోక్యం ఉంటుంది. ఇంకో విషయం ఏమిటంటే సామాజిక శాసనాలను రూపుమాపే పక్షంలో వ్యక్తుల నీథి నడవడికల పై దాని దుష్ప్రభావం పడే ప్రమాదముంది. ఉదాహరణకు, ఒకవేళ ఎవరయినా ఒక వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చేసి ఉంటే, అదే సమయంలో మరోవంక విడా కులు చట్టవిరుద్ధమని ఖరారయి ఉంటే - అట్టి పరిస్థితిలో షరీఅత్ దృష్ట్యా ఆవిడ అతని భార్య అయి ఉండదు. కాని చట్టపరమయిన ఆంక్షల మూలంగా ఆవిడ ఇప్పటికీ అతని భార్యగానే వర్ధిల్లుతుంటుంది. అటువంటప్పుడు భార్యకాని భార్య మరియు భర్త కాని భర్త అయిన ఆ ఇద్దరు స్తీ పురుషుల సామాజిక, నైతిక స్థాయి అడుగంటిపోవటంలో సందేహమేముంది? అదే క్రిమినల్ చట్టమయితే దాని పరిస్థితి ఇందుకు భిన్నమయినది. క్రిమినల్ చట్టాల సంబంధం నేరస్థులను శిక్షింఛటం వరకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం రద్దుచేయబడిన ఇస్లామ్ క్రిమినల్ చట్టాన్ని ఇప్పుడు పర్సనల్ లా గొంతునులిమే ఉద్దేశ్యంతో ఉదాహరించడం ఏ విధంగానూ న్యాయసమ్మతం కాదు.
భారత రాజ్యాంగం : 44వ నిబంధన
ముస్లిమ్ పర్సనల్ లాను మార్చాలంటూ దేశంలో ఒక ఉద్యమం నడపబడుతోంది. ముస్లిమ్ పర్సనల్ లాను పూర్తిగా తుదముట్టించి దాని స్థానే అన్ని వర్గాలకు, అన్ని మతాలవారికి సమానంగా వర్తించే ఒక సివిల్ కోడ్‌ను ప్రవేశ పెట్టాలన్నది దాని ప్రధాన ఉద్దేశ్యం. ఇంకా దాని పరమార్థం ఏమిటంటే ఒక ముస్లిమ్‌కీ - ముస్లిమేతర పౌరునికీ మధ్య ఎటువంటి విచక్షణ ఉండకూడదు.
38
ఇస్లామ్ లేదా మరే ఇతర మతానికి చెందిన కుటుంబ చట్టం కూడా తనదయిన వైశిష్ట్యాన్ని కాపాడుకునే విధంగా మిగిలి ఉండకూడదు అన్నది. అసలు ఈ ఉద్యమానికి ప్రేరణ పాశ్చాత్య నాగరికత, దీనికి పునాది పదార్థ ప్రధానమైన జీవన దృక్పథం. అయితే రాజ్యాంగంలోని నిర్దేశిక సూత్రాల. (Directive Principles) ను వివరిస్తున్న 44వ అధికరణ దీనికి ఓ ప్రాతిపదికను సమకూర్చిపెట్టింది. 44వ అధికరణలో ఇలా ఉంది:
The State shall endeavour to secure for citizens a Uniform Civil Code throughout the territory of India.
“యావద్దేశంలో పౌరుల కోనం ఉమ్మడి సివిల్ కోడ్‌ని రూపొందించేందుకు రాజ్యం కృషి చేన్తుంది.” అయితే రాజ్యాంగంలోని ఈ అధికరణ ఇతర నిర్దేశిక సూత్రాల వలెనే కేవలం నిర్దేశిక సూత్రాల స్థాయిని మాత్రమే కలిగి ఉంటుంది. అంతేగాని ఏ క్షణంలో కూడా అది రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల (FUNndAaMental Rights) తో సరితూగదు. ప్రాథమిక హక్కులకు ఎట్టి పరిస్థితిలోనూ నిర్దేశిక సూత్రాలపై ఆధిక్యత ఉంటుంది. ఆ విషయమే ఇలా పేర్కొనబడింది:
“ప్రజలందరికీ సమానంగా భావప్రకటనా స్వాతంత్ర్యం ఉంటుంది. తమకు నచ్చిన మతాన్ని స్వేభ్భగా స్వీకరించే, దాని అవలంబించే, దాన్ఫి ప్రచారం చేసుకునే హక్కు కూడా వారికి ఉంటుంది.” (అధికరణ : 25)
మత స్వాతంత్ర్యానికి ఉద్దేశించిన ఈ అధికరణ దృష్ట్యా ఏదేని ఒక వర్గానికి చెందిన మత స్వాతంత్ర్యాన్ని కబళించే, అది తన మత బోధనలకు విరుద్ధంగా ఆచరించేందుకు బలాత్కరించే ఎటువంటి “సివిల్ కోడ్”కూ అవకాశం ఉండ కూడదు. ఒకవేళ అలాంటిదేదయినా జరిగితే అది నేరుగా మతంలో ప్రభుత్వ జోక్యం కిందికే వస్తుంది. అదే గనక జరిగేట్టయితే “ప్రజలందరికీ తమ మత
39
ధర్మాన్ని అవలంబించే పూర్తి స్వేచ్చ ఉంటుందన్న రాజ్యాంగ హామీకి అర్థం లేదు. రాజ్యాంగంలోని ఇంత ముఖ్యమయిన ప్రాథమిక హక్కును చాటిచెబుతున్న అధికరణ (25)ను విస్మరించి నిర్దేశిక నియమానికి సంబంధించిన 44వ నిబంధననే వీళ్ళు పట్టుకోవడం కడు విచిత్రం కదూ?!
ఇక నిర్దేశిక నియమాల (Directive Principles) విషయానికి వద్దాం. మద్యపాన నిషేధం కూడా నిర్దేశిక నియమాల్లోనిదే. దాన్ని అమలుపరిచే విష యంలో నిజానికి ఏ మతమూ అడ్డుపడటంలేదు. మరి ఎన్ని రాష్ట్రాలు ఈ నిషే ధాజ్ఞను అమలుపరుస్తున్నాయి? కొన్ని రాష్ట్రాలయితే క్రమక్రమంగా ఆంక్షల్ని సడలించటం మొదలెట్టాయి. ఉదాహరణకు, కేరళనే తీసుకోండి, అక్కడ మద్య నిషేధం ఉత్తర్వు ఎత్తివేయబడింది. మహారాష్ట్ర ప్రభుత్వం మొదట్లో మెతక వైఖరిని అనుసరించేది. ఇప్పుడదీ లేకుండా సాంతం వదిలేసింది. రాజ్యాంగంలోని ఒక నిర్దేశిక నియమం పట్టు నుండి తమను విముక్తం చేసుకోవటానికి వీలయినన్ని తరుణోపాయాలను వెతికిపట్టుకుంటూ, అదే సమయంలో మతావలంబనలో జోక్యానికి ఆస్కారమిచ్చే వివాదాస్పదమయిన మరో నిర్దేశిక నియమాన్ని బలవంతాన రుద్దడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదేమి న్యాయం? ఇదేమి ధర్మం?
తేలిందేమిటంటే సంవిధానంలోని 44వ అధికరణ యధాతధంగా ఉన్నంత కాలం కామన్ సివిల్ .కోడ్ కరవాలం వ్రేలాడుతూనే ఉంటుంది. ముస్లిమ్ పర్సనల్ లాకు ప్రమాదం పొంచి ఉంటుంది. ముస్లిమ్ పర్సనల్ లాలో మార్చులు చేయబోమని పాలక వర్గంవారు ఎన్ని హామీలిచ్చినా, మరెన్ని వాగ్దానాలు చేసినా ప్రమాదం మాత్రం తొలగిపోదు. ఎందుకంటే పాలకులు చేసే వాగ్దానాల సంగతి మనకు తెలియనిది కాదు.
అదలా ఉంచితే ప్రజాస్వామిక వ్యవస్థలో రాజ్యాధికారం ఒకరి వద్ద ఉండదు. అది తరచూ చేతులు మారుతూ ఉంటుంది. నేడు అధికార స్థానంలో ఉండి హామీల అభయం ఇచ్చినవారు రేపు ఆ స్థానంలో ఉండకపోవచ్చు.
40
అదీగాక నేడు వాగ్దానాలు చేసిన నాయకుల అనుయాయులు రేపటి రోజున ఆ మాటలకు కట్టుబడి ఉంటారన్న నమ్మకం ఏమిటి? కాబట్టి రాజ్యాంగంలోని సదరు అధికరణ (44)ను తీసివేయటమో లేదా దానివల్ల ముస్లిమ్ ఫర్సనల్ లా భద్రతకు ఎలాంటి ముప్పువాటిల్లకుండా ఉండే రీతిలో దాన్ని సవరించటమో చేయాలి. ఇది అత్యంత అవసరం.
రాజ్యాంగ నిర్మాణ సభలో రాజ్యాంగ మండలి 44వ అధికరణ పై సమాలోచన జరుగుతున్నప్పుడు ముస్లిమ్ సభ్యులు అనేక సవరణలను సూచించారు. శ్రీయుత ఇస్మాయీల్ (మద్రాసు)గారు ప్రతిపాదించిన సవరణ ఇలా ఉంది:
Provided that any Group, Section or Community of People shall not be obliged to give up its own Personal Law, in case it has such aLaw. (Directive Principles in the Indian Constitution By K.C.
Merkenden P.193)
“అయితే దీనివల్ల నమాజంలోని ఏ వర్గం, విభాగం లేదా మత వర్గంపై, అది తన వ్యక్తిగత భట్టాన్సి - అటువంటి చట్టం అంటూ ఏదయినా దానికున్సట్లయితే - విడనాడాలన్హ నియమం విధించడం జరగదు.”
శ్రీ నజీరుద్దీన్‌గారు నూచించిన నవరణ ఇలా ఉంది -
Provided that the Personal Law of any Community which has been guaranteed by the State shall not be changed except with the previous approval of the Community ascertained in such manner
as the Union Legislature may determine by Law. (-do- Page:193)
“కాని ఏదేని మత వర్లవు వ్యక్తిగత చట్టం గురించి రాష్ట్రం హామీ ఇచ్చి ఉంటే దాన్సి మార్చటం జరగదు. సదరు మత వర్గం నుండి ఆ మేరకు యూనియన్ చట్టనభ ద్వారా నిర్హయమయిన చట్టం ద్వారా పొందిన అనుమతి ముందుగానే లభిస్తే అలా మార్చవచ్చు.”
41
ఈ సవరణ సూచిస్తూ శ్రీ నజీరుద్దీన్, రాజ్యాంగంలోని ఈ అధికరణ (44వ అధికరణ) మత స్వాతంత్ర్యాన్ని గురించి వివరిస్తున్న అధికరణతో ఘర్షణపడే విధంగా ఉన్నదని, ఇంకా అందులో ఇవ్వబడిన (మత స్వేచ్చ) హామీని ఈ అధికరణ (44) హరించే అవకాశం కూడా ఉందని భయాందోళనను వెలిబుచ్చారు.
మూడవ సవరణను మహబూబ్ అలీ బేగ్ బహదూర్ (మద్రాసు) ప్రతిపాదించారు. ఆయన ఇలా అన్నారు:
Provided that nothing in this Article shall affect the Personal Law of the Citizen. (-do - P. 193)
“అయితే ఈ అధికరణలోని ఏ అంశమూ పౌరుల వ్యక్తిగత చట్టంపై మాత్రం ప్రభావం వేయరాదు.”
శ్రీ బి. పోకర్ సాహెబ్ బహదూర్ (మద్రాస్) చేసిన ప్రతిపాదన ఇంచుమించు ముహమ్మద్ ఇస్మాయీల్‌గారి ప్రతిపాదననే పోలి ఉంది.
పార్లమెంటు సభ్యులు సూచించిన ఆయా సవరణలపై ఆనాడు రాజ్యాంగ నిర్మాణ సభలో వేడి వాడిగా చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో పాల్గొన్న వారిలో కె.ఎం. మున్నీ, ఎం.ఆర్. మసానీ, ఎ.కె. అయ్యర్ వంటి హేమాహేమీలు ఉన్నారు. ఒక దశలో కె.ఎం. మున్నీ ఈ విధంగా కూడా పలికారు:
It was the desire of the framers of the Constitution to divorce from Perosnal Law. (-do-P.195)
“వర్సనల్‌లా నుండి విడాకులు ఇవ్పించాలన్మది ఈ రాజ్యాంగ రూవకర్తల అభిలాషలా ఉంది.”
ఈయన తన ప్రసంగంలో టర్కీ, ఈజిష్ట్‌లలోని సంస్కరణలను కూడా
ఉదాహరించారు. అయితే యూనిఫాం సివిల్ కోడ్‌ను వారిపై బలవంతంగా
42
రుద్దేదిలేదని ఆ సందర్భంలో డా. అంబేద్కర్ ముస్లిములకు అభయమిచ్చారు. ఆయన ఇంకా ఇలా అన్నారు:
“యూనిఫాం సివిల్ కోడ్‌కు మనఃపూర్వకంగా తాము కట్టుబడి ఉంటామని ప్రకటించేవారికి మాత్రమే ఇది వర్తించేలా భావిలో చట్టం చేయడం పార్లమెంటు పని అవుతుంది.” అంబేద్కర్ ఈ హామీని ఇచ్చిన తరువాత పైన ప్రస్తావనకు వచ్చిన వివిధ సూచనలు త్రోసిపుచ్చబడ్డాయి. ఆఖరికి నేడు 44వ అధికరణ రూపంలో ఉన్న ముసాయిదాను ఆమోదించటం జరిగింది.
శ్రీ ముహమ్మద్ ఇస్మాయీల్ (మద్రాసు)గారైతే ఇంకా ముందుకుపోయి - ముస్లిమ్ పర్సనల్ లా రక్షణకై - రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను ఉద్దేశించిన అధికరణలలో సయితం క్రింది అంశాన్ని చేర్చాలని పట్టుబట్టారు:
To follow the Personal Law of the groups or community to which he belongs or professes to belong. (Constituent Assembly Debates, Vol: VII P. 721)
“అతను ఏ వర్గంతో లేక ఏ మత వర్గంలో సంబంధం కలిగి ఉంటాడో లేదా నంబంధం పెట్టుకున్నట్లు వ్రకటిస్తాడో ఆ వర్గం యొక్క వర్సనల్ లాను ఆవలంబించవచ్చు (ఆ మేరకు అతనికి వూర్తి స్వేబ్బ ఉఊండాలి.)' అయితే రాజ్యాంగ నిర్మాణ సభ ఈ సూచనను కూడా సమ్మతించలేదు. నేడు ముస్లిమ్ పర్సనల్ లా విషయమయి మనం ఏ ముప్పును ఎదుర్కొంటున్నామో దాన్ని గురించి రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే దూరదృష్టి గల మేధావులు పసిగట్టారు. ఇక అంబేద్కర్ హామీలంటారా, వాటి సంగతి పాలకులకు నేడు ఏ మాత్రం గుర్తులేదు. కాబట్టి ఇప్పుడు మరిన్ని హామీల, అభయాల అవసరం ఏమీ లేదు. ఇప్పుడు అవసరమయినదల్లా రాజ్యాంగాన్ని సవరిస్తూ ముస్లిములకు తమ పర్సనల్ లాను అవలంబించే పూర్తి స్వేచ్చ ఉంటుందని తిరుగులేని
43
విధంగా భారత రాజ్యాంగంలో సవరణ జరగడమే. అంతవరకూ ముస్లిమ్ పర్సనల్ లా నెత్తిపై “యూనిఫాం సివిల్ కోడ్" ఖడ్గం వ్రేలాడుతూనే ఉంటుంది.
రాజ్యము - దాని సెక్యులర్ స్వభావం
ముస్లిమ్ పర్సనల్ లాను వ్యతిరేకించేవారు మాటిమాటికీ రాజ్యం, దాని సెక్యులర్ స్వభావాన్ని ఉదాహరిస్తూ ఉంటారు, సెక్యులరిజం కోరేదాని ప్రకారం దేశ పౌరులందరి కుటుంబ చట్టాలలో సమత్వం ఉండాలన్నది వారి అభిమతం. వివిధ మత వర్గాలవారి కోసం వేర్వేరు కుటుంబ చట్టాలు (FAMily Laws) ఉంటే వారి మధ్య విచక్షణ (Discrimination) చూపినట్లే అవుతుందని, ఇది సెక్యులరిజం స్వభావానికే సరిపడని విషయం అని వీరు వాదిస్తారు.
ప్రపంచ చిత్రపటంలో ఒక్క ఇండియా మాత్రమే సెక్యులర్ దేశమా? ప్రపంచంలో మరే సెక్యులర్ రాజ్యామూ లేదా? అని ఈ అతివాద సెక్యులరిస్టులను అడగాలి. ముస్లిమ్ పర్సనల్ లా జోలికి కూడా పోని అనేకానేక సెక్యులర్ రాజ్యాల గురించి ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులకు తెలీదులా ఉంది. ఉదాహరణకు థాయి లాండ్‌నే తీసుకోండి - అక్కడ బౌద్ధ మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. థాయి ప్రభుత్వం వారి కుటుంబ చట్టాలలో పెద్ద ఎత్తున సంస్కరణలను కూడా చేపట్టింది. అయితే ఆ సంస్కరణలు బౌద్ధ మతానికి మాత్రమే పరిమితమయ్యాయి. ముస్లిములను దాన్నుంచి మినహాయించి, వారి వ్యక్తిగత చట్టాన్ని వారు అవలంబిం చేందుకు స్వేచ్చ ఇవ్వటం జరిగింది. బర్మాలోనూ ఇదే పరిస్థితి. గ్రీకు దేశంలో ముస్లిమ్ పర్సనల్ లా ముఫ్తీల (ఇస్లామ్ ధర్మవేత్తల) ద్వారా ప్రవేశపెట్టబడుతున్నది. ఆఫ్రికా దేశాలయిన ఇథియోపియా, ఘనా, గోల్డ్ కోస్ట్, యుగాండాలలో కూడా ముస్లిమ్ పర్సనల్ లా నిక్షేపంగా కొనసాగుతోంది.* ఈ దేశాలలో అధికాంశ దేశాల రాజ్యాంగం సెక్యులర్ ప్రాతిపదికపైనే ఉంది. మరికొన్ని రాజ్యాలైతే కమ్యూనిజం
యన పప లట వాం * చూడండి - Family Law Reform in the Muslim World by Tahir Mahmood. P.4
44
దృక్పథం గలవి. ముస్లిమ్ పర్సనల్ లా అమలులో ఉండటం వలన అక్కడి సెక్యులర్ వ్యవస్థలకు కలగని ఆటంకాలు భారత దేశంలోనే కలుగుతున్నాయా?
జాతీయ సమైక్యత
దేశంలో ఎప్పుడు, ఎక్కడ మతకలహం జరిగినా దానిపై రాజకీయవాదుల ప్రతిస్పందన ఒకే విధంగా ఉంటుంది - “జాతీయ సమైక్యత కొరకు యూనిఫాం సివిల్ కోడ్ (UnNifOrMm Civil 6069)ను విధించవలసిన అవసరం ఉంది” అని, మత కలహాలకు మూలకారణం ముస్లిమ్ పర్సనల్ లాయే అన్నట్లు. దాన్ని గనక రద్దుచేసి యూనిఫాం సివిల్ కోడ్‌ను ప్రవేశపెడితే చాలు, మతకలహాల పరంపరకు బ్రేకు పడిపోతుందన్నట్లు వారు మాట్టాడ్తారు. ఈ 'రోగ నిర్ధారణ” చేస్తున్నది అల్లాటప్పా వైద్యులే కానట్లయితే, ముస్లిమ్ పర్సనల్ లా మూలంగా ఎప్పుడు, ఎక్కడ మతకలహం జరిగిందో చెప్పమని వారిని ప్రశ్నించాలి. భారత దేశంలో జరిగిన వేలాది మతకలహాలలో ఏ ఒక్కదానికయినా ముస్లిమ్ పర్సనల్ లా కారణభూతమై ఉంటే అదెక్కడో వారు చూపెట్టాలి, కలహ కారణాలను వెతికి పట్టుకునేందుకు ఇప్పటి వరకూ అనేకానేక విచారణ సంఘాలు నియమించ బడ్డాయి. వాటిలో ఏ ఒక్క కమీషన్ అయినా తన నివేదికలో ఆ నరమేధానికి మూలం ముస్లిం పర్సనల్ లాయేనని పేర్కొన్నదా అని ప్రశ్నిస్తే సమాధానం “లేదు” అనే వస్తుంది. మరి అలాంటప్పుడు మతకలహాలు జరిగినప్పుడల్లా ముస్లిమ్ పర్సనల్ లాను చర్చావేదికల పైకి ఈడ్చుకురావటంలోని జె చిత్యం ఏమిటి?
మత కలహాల సంగతి అలా ఉంచితే, వివిధ మతవర్గాల మధ్య భావనాపర మయిన సౌమనస్యాన్ని, భావ సామరస్యాన్ని, సృజించేందుకు యూనిఫాం సివిల్ కోడ్‌ని నిర్మించుకోవలసిన అవసరం ఉందని కోరే మహానుభావులు మరికొందరు. జస్టిస్ వై.వి. చంద్రచూడ్ ఒకసారి బొంబాయిలో ప్రసంగిస్తూ ఇలా అన్నారు:-
One Law of marriage for all would be an important step towards national integration. (Indian Express: 21-6-67)
45
“అందరికీ ఒకే వివావా చట్టం (వ్రవేశపెట్టినట్లయితే) అది జాతీయ నమైక్యత వైపునకు వేసే ముఖ్యమయిన అడుగు అవుతుంది.”
కాని వాస్తవానికి ఇది తలా తోక లేనివాదన. ఎందుకంటారేమో. ఇటువంటి చర్యల ద్వారా తమ మత సాంస్కృతిక సంప్రదాయాలు రూపుమాపబడుతున్నాయన్న భావనే గనక అల్ప సంఖ్యాక జనుల్లో కలిగిందంటే దాని ప్రతిస్పందన తీవ్రంగా ఉండవచ్చు. దాని మూలంగా అల్బ సంఖ్యాకులు - అధిక సంఖ్యాకుల మధ్య గల సత్సంబంధాలు దెబ్బతినవచ్చు. దీనికి భిన్నంగా - ప్రజాస్వామిక వ్యవస్థలో నిర్ణయాత్మక స్థాయిని కలిగి ఉన్న అధిక సంఖ్యాక వర్గం గనక అల్పసంఖ్యాకులతో ఉదార వైఖరిని అలవరచుకున్నట్లయితే, వివిధ వర్గాలవారికి వీలైనంత ఎక్కువగా మత సాంస్కృతిక స్వేచ్చను ఇచ్చినట్లయితే ఆయా వర్గాల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుంది. సత్సంబంధాలు విస్తృత స్థాయిలో నెలకొంటాయి. ఈ సత్సంబంధాలు మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను పెంపొందించడంలో దోహదపడతాయి. కుతర్కాలు, పిడివాదనలతో సమస్యలు పరిష్కారం కావు. ఏ తర్కం ఆధారంగానయితే యూనిఫాం సివిల్ కోడ్ ఆవశ్యకత గురించి నొక్కి చెబుతున్నారో ఆ తర్కాన్నే ఉపయోగించి రేపటి రోజున యూనిఫాం వర్షిప్ కోడ్ (Uniform Worship Code) కావాలని కూడా కోరవచ్చు. మసీద్ అనీ, మందిరమనీ ఎందుకొచ్చిన గొడవ? వీటన్నింటినీ కూల్చి పారేసి జాతీయ ఆరాధనాలయాల (NationalTemples)ను ఎందుకు నిర్మించుకోరాదు? అక్కడ అన్ని మత వర్గాలవారు ' ఒకే వరుసలో నిలబడి జాతీయ స్మృతి (National Code) ననుసరించి ఉమ్మడి ఆరాధన చేసుకోవచ్చు. ఆ ఆరాధన కూడా దైవారాధన గాకుండా జాతి (National) ఆరాధనగా ఉంటే సరిపోతుంది అనే ఆలోచనలకు కూడా అంకురార్పణ జరుగు తుంది. దానిక్కూడా ఒక లాజిక్‌ను జోడించవచ్చు. అదేమంటే, దేవుని పేరు ఎత్తిన చోటల్లా “విశ్వాసాల వాదులాటలు మొదలవుతాయి, దాన్నుండి వర్గాలు పుట్టుకువస్తాయి. వర్గాల నుండి వర్గ దురభిమానం జనిస్తుంది. కాబట్టి పాడేవాడే లేకపోతే పాట కచేరీయే ఉండదన్నట్లు జాతీయ సమైక్యత కావాలంటే వీటన్నింటినీ
46
ఎత్తివేయటం అనివార్యం! అయినా, ఇంత స్పష్టమయిన తర్కాన్ని చెప్పడానికి మన రాజకీయవాదులు ఎందుకు తడుముకుంటున్నారో!!
నవ నాగరికత కోరేది
ముస్లిములలో ఒక వర్గం ఉంది. సంఖ్య దృష్ట్యా అది చాలా చిన్నది. కాని అది “క్రొత్త వెలుగు”లో కళ్ళు తెరచింది. ఆధునిక పోకడల కనుగుణంగా ముస్లిమ్ పర్సనల్ లాలో మార్పులు జరగాలని అది కోరుతున్నది. దాని ఈ కోర్కెకు కారణం ఏమిటి? షరీఅత్ చట్టాలు క్రూరమయినవనా? వీటి మూలంగానే ముస్లిమ్ సమాజంలో చెడుగులు ప్రబలుతున్నాయని వారు భావిస్తున్నారా? అందువల్లనే ఈ చట్టాలను సంస్కరించాల్సిన ఆవశ్యకత ఉందని వారు తలపోస్తున్నారా? అంటే ఇదేదీ కాదు. తాను సృష్టించిన మానవుల ప్రయోజనాలను, వారి మనుగడను బాగా ఎరిగిన దేవుడు ఈ షరీఆత్ శాసనాలను అవతరింపజేసి నపుడు అవి క్రూరమయినవనే ప్రశ్నే తలెత్తదు. అసలు విషయం ఏమిటంటే నవ నాగరికతా తళుకుబెళుకులను చూసేసరికి ఈ వర్గంవారి కళ్ళు జిగేల్‌మన్నాయి. దృష్టి. చెదరిపోయింది. పాశ్చాత్య ప్రపంచం నుండి కానుకగా లభించిన “న్యాయం, 'సమానత్వం' వంటి అందమైన నినాదాల వరదల్లో కొట్టుకుపోతున్న ఈ నవతరానికి ఇస్లామ్ సామాజిక నియమాలు లోపభూయిష్టంగానే కనిపిస్తాయి మరి. వారి దృష్టిలో ఇస్లామ్ సామాజిక వ్యవస్థకు ఇప్పుడు కాలం చెల్లిపోయింది. ఎందుకంటే అది నేటి అధునాతన ధోరణులతో సమరసం చెందలేకపోతోంది. అందుచేత ఈ బంధనాల నుండి విముక్తులయి కొత్త పుంతలు లొక్కాలని, స్తే" పురుషులుభయులకూ సమాన స్థాయి ఉండే నవీన దృక్పథాల కనుగుణంగా సామాజిక వ్యవస్థను రూపొందించుకోవాలని వారు కోరుతున్నారు.
ఈ వర్గంవారే గనక విశాల హృదయంతో ఇస్లామ్ సామాజిక వ్యవస్థను అధ్యయనం చేసి ఉంటే, మానవ నైజాన్ని, అతని నైతికతా స్థాయిని విస్మరించకుండా ప్రశాంత మనసుతో ఆలోచించి ఉంటే ఇస్లామీయ వ్యవస్థలోని అద్భుతమయిన
47
సమన్వయ సౌందర్యం, సమతూకం వారికి కానవచ్చేది. నిస్సందేహంగా ఇస్లామ్ స్త్రీపై పురుషుడికి ఒకింత ఆధిక్యతను ప్రసాదించింది. పురుషుణ్ణి కుటుంబ యజమానిగా చేసి ఈ ఆధిక్యతనిచ్చింది. పురుషుని స్వభావ స్వరూపాల దృష్ట్యా అతని సహజ ప్రవృత్తుల దృష్ట్యా అతని శరీర నిర్మాణం తీరు రీత్యా ఈ ఆధిక్యత నివ్వడం జరిగింది. ఇలా ఆధిక్యత ఒకరికి లేనిదే కుటుంబ వ్యవస్థలో క్రమశిక్షణగాని, నైతిక విలువలుగాని మిగలవు. ఈ కారణంగానే ఇస్లామ్ 'తలాక్' అధికారం స్త్రీకి గాక పురుషుడికి ఇచ్చింది. అయితే 'ఖులా' హక్కు స్త్రీకి తప్పని సరిగా ఉంటుంది. అలాగే తండ్రి ఆస్తిలో కొడుకుకు లభించే భాగంలో సగ భాగమే కుమార్తెకు లభిస్తుంది. ఎందుకంటే సంపాదన, పోషణల బాధ్యత పురుషుడిపై ఉంది.. అతను తన భార్యాబిడ్డల కోసం అన్న వస్త్రాలను ఏర్పాటు చేయవలసి ఉంటుంది. అదీగాక స్రీ తన భర్త నుండి “మహర్” రూపంలో కూడా కొంత సొమ్మును పొందుతుంది. అందుచేత మానవ నైజం, న్యాయం, ధర్మాల రీత్యా కొడుకు కూతుళ్ళకు లభించే ఆస్తి భాగంలో వ్యత్యాసం ఉండాలి. కాని న్యాయం పేరిట అన్యాయ దండాన్ని త్రిప్పగోరుతున్న ఆధునిక నాగరికత ఈ యదార్థ దృష్టిని ఎప్పుడు గ్రహిస్తుందని? అదయితే 'సమానత్వమే' సర్వస్వమని భావిస్తున్నది. కాగా, సమానత్వపు ఈ తీవ్ర ధోరణి మానవ ప్రవృత్తికి సరిపడదు. మానవులవడం చేత తండ్రీ కొడుకులు సమానులే. సందేహం లేదు. అయినప్పటికీ తండ్రికి కొడుకుపై ఆధిక్యత ఉంది. తండ్రి పెద్దరికాన్ని గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించటం కొడుకు బాధ్యత. కాబట్టి అతను తండ్రికి విధేయుడై మెలగవలసి ఉంటుంది. అయితే 'సమానత్వం' అనే అతివాద సిద్ధాంతాన్నే గనక అవలంబించినట్లయితే తండ్రీ కొడుకులుభయు లూ సమానులేనని, వారిరువురిలో అంతస్తులకు తావు లేదని, తండ్రి చెప్పినట్టుగా కొడుకు వినవలసిన అవసరమే ' లేదని అనవలసివస్తుంది. ఇంకా, తండ్రి ఆదేశాన్ని కొడుకు శిరసావహించనప్పుడు న్యాయం, సమానత్వం ప్రాతిపదికలపై కొడుకు ఆదేశాలను తండ్రి కూడా శిరసావహించాలని ఎందుకు భావించరాదు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
48
. ముస్లిమ్ దేశాలలోని ముస్లిం పర్సనల్ లా లో మార్పులు
ఆధునిక సిద్ధాంతాల కనుగుణంగా ముస్లిం పర్సనల్ లాలో మార్పులు తీసుకురావాలని కోరేవారంతా తమ వాదనకు ఆధారంగా ముస్లిమ్ దేశాలను ఉదాహరిస్తారు. ముస్లిమ్ దేశాలలోని పర్సనల్ లాలో మార్పులు చేస్తున్నప్పుడు భారత. ముస్లిములు మార్పుకు అంగీకరించకపోవడానికి వీరేమన్నా ప్రపంచ ముస్లిమ్‌ల కంటే విలక్షణమయినవారా? అన్నది వారి ఆక్షేపణ. ఇటువంటి ఆక్షేపణలు పరిస్థితుల నిజ స్వరూపాన్ని ప్రతిబింబించవు సరికదా, అవి అతిశ యోక్తులతో ఓ తప్పుడు భావాన్ని కలిగింపజూస్తాయి.
యదార్థానికి ముస్లిమ్ దేశాలలో అధికాంశం దేశాల్లో ముస్లిమ్ పర్సనల్ లాలో ఎలాంటి మార్పులు జరగలేదు. పైగా అక్కడ షరీఅత్ శాసనాలే అమల్లో ఉన్నాయి. సఊదీ అరేబియా, యమన్, బహరెయిన్, కువైత్, ఖతర్, అబూధాబి, దుబాయి, అఫ్థానిస్తాన్, మాల్దీవ్స్, డైనీ (6౮1NEA), సెనెగాల్, సోమాలియా, నైజీరియాలు దీనికి ప్రబల నిదర్శనాలు. ఈ దేశాలలో ఒక చోట హంబలీ ఫికహ్ (ధర్మశాస్త్రం) ఉండగా మరొక దేశంలో మాలికీ ఫికహ్ అమల్లో ఉంది. ఒక దేశంలో హనఫీ ఫికహ్‌కు చట్టపరమయిన స్థాయి ఉండగా వేరొక దేశంలో షాఫయి శాస్త్రానికి ఆ ప్రతిపత్తి ఉంది. సఊదీ ఆరేబియాలో హంబలీ శాస్త్రానికి చట్టస్థాయి ఉంది. పైగా ఆ దేశ సంవిధాన నిర్దేశాల ప్రకారం ఏ శాసన నిర్మాణం జరిగినా అది ఖుర్‌ఆన్, హదీసులకు మరియు సహాబాల (ప్రవక్త సహ వరుల) ' ఆదర్శ జీవితాలకు అనుగుణంగా ఉండాలి. యమన్‌లో జైదీ ఫికహ్ అమల్లో ఉంది. దక్షిణ యమన్‌లో* షాఫయి ఫికహ్ లేదా హనఫీ ఫికహ్‌ను అనుసరిం చటం జరుగుతుంది. బహరెయిన్‌లో మాలికీ, షాఫయి, షియా ఫికహ్‌లకు చట్ట స్థాయి ఉంది. ఎవరే శాస్త్రాన్ని అనుసరిస్తారో దాని ప్రకారం ఆయా వ్యక్తుల వ్యవహారాలు నిర్ణయించబడతాయి. కువైత్‌లో ఇస్లామ్ కుటుంబ చట్టం అమల్లో ఉంది. సాధారణంగా అక్కడ మాలికీ ఫికహ్‌ో ను అనుసరిస్తారు. అఫ్ఫానిస్తాన్ *౫ రెండు యమన్‌లు ఇటీవల విలీనమయినాయని. గమనించాలి. ** చూడండి - FAaMily Law Reform in the Muslim World by Tahir Mahmood. 23
49
సంవిధానం ప్రకారం అక్కడి రాజ్యధర్మం ఇస్లామ్. అక్కడి ధార్మిక వ్యవహారాలన్నీ హనఫీ ఫికహ్ ననుసరించి నిర్వర్తించబడతాయి. చెలామణిలోనున్న అక్కడి ఇస్లామీయ చట్టంలో ఎటువంటి మార్పు చేయబడలేదు. ,మాల్టీవ్స్‌లో కుటుంబ ' చట్టం షాఫయి విధానానికి అనుగుణంగా అమల్లో ఉంది. ఆఫ్రికా దేశాలయిన చాడ్, గాంబియా, గైనీ, మాలీ, మారతానియా, నైజీరియా, సెనగాల్ మరియు సోమాలియాలలో ఇంతవరకు ఇస్లామ్ కుటుంబ చట్టాలలో మార్చు నిమిత్తం ఎలాంటి చర్య గైకొనబడలేదు. నైజీరియాలో మాలికీ శాస్త్రానికి కుటుంబ మరియు వారసత్వ చట్టాల స్థాయి ప్రాప్తించింది.
ఇక ఏ ముస్లిమ్ దేశాల్లోనయిలే కుటుంబ చట్టాలలో సంస్కరణలు చేయ బడ్డాయో, వాటిలో చాలా వరకు వివిధ ఫికహ్‌లలో (శాస్త్రాలలో) ఏదో ఒక ఫికహ్ అంశాలకు చట్టపరమయిన ప్రతిపత్తి కల్పించే ఉద్దేశ్యంతో, కొన్ని అప్పీళ్ళను క్రమ బద్ధంగా రూపకల్పననిచ్చే ఉద్దేశ్యంతో సంస్కరణలు చేయబడ్డాయి. వాటిలో చాలా వరకు పరిపాలనా యంత్రాంగానికి సంబంధించినవేనన్న సంగతి మరువ రాదు. పోతే; రెండే రెండు దేశాలు ఇస్లామ్ కుటుంబ చట్టాలను రూపుమాపి సెక్యులర్ తరహా సివిల్ కోడ్‌ను ప్రవేశపెట్టే సాహసానికి ఒడిగట్టాయి. ఆ రెంటిలో ఒకటి అల్బానియా, మరొకటి టర్కీ. టర్కీలో ఈ మార్పు 1926లోనే వచ్చింది. ఇస్లామ్‌లోని కుటుంబ చట్టాలు వారసత్వ చట్టాలను త్రోసిరాజని అక్కడ స్విట్టర్ లాండ్ తరహా సివిల్ కోడ్‌ని విధించటం జరిగింది. అయితే టిర్కీలో ముస్తఫా కమాల్ పాషా హయాంలో ఇస్లామ్‌ను చీల్చి చెండాడటానికి తీసుకోబడిన చర్యలూ బలప్రయోగంతో నాస్తికతా ప్రధానమైన రాజ్యాన్ని నెలకొల్పడానికి అక్కడ జరిగిన ప్రయత్నాల గురించి ఎవరికి తెలియదు గనుక? ఆఖరికి అక్కడ అరబీ భాషలో “అజాన్' ఇవ్వటం పట్ల కూడా ఆంక్ష విధించబడింది. అందుచేత అటువంటి (ధర్మభ్రష్ట) దేశాన్ని ఉదాహరణగా చూపి మన దేశ ముస్లిమ్ పర్సనల్ లాలోనూ మార్చు రావాలని కోరటంలో అర్థం లేదు. ఇక్కడ విస్మరించరాని విషయం మరొకటి ఉంది - అదేమంటే, ఏ ముస్లిమ్ దేశమైనా షరీఅల్ ఉద్దేశ్యానికి విరుద్ధంగా ముస్లిమ్ పర్సనల్ లాలో మార్పుకు పాల్పడటమో లేదా దాన్ని అంత
50
మొందించి ముస్లిమేతర తరహా కోడ్‌ను విధించటమో చేస్తే దాన్ని షరీఅత్ మాత్రం ఎన్నటికీ సమ్మతించదు. ఇంకా, అటువంటి సవరణా చర్యలు. ఇతర దేశాల ముస్లిములకు ఆదర్శప్రాయమూ కానక్కరలేదు. మార్పు దృష్టితో ఇక్కడ మాటిమాటికీ టర్కీని ఉదాహరిస్తున్నవారు షరీఆత్ శాసనాలను యధాతథంగా అమలుపరుస్తున్న దేశాల దృష్టాంతాన్ని ఎందుకు ఉదాహరించరు? అటువంటి దేశాలు ఒకటీ రెండూ కావు, అనేకం ఉన్నాయన్న సంగతిని మేము వెనుకటి పుటల్లో ప్రస్తావించి ఉన్నాము.
ఇస్లామ్ కుటుంబ, వారసత్వ చట్టాలను రద్దుచేయటానికి ఇంత వరకు ఇస్రాయీల్ ప్రభుత్వం కూడా సాహసించలేదు. 1917లో తురుష్కులు షరీఅల్ వెలుగులో సంకలనం చేసిన కుటుంబ చట్టం - OttomanLaw of Family Rights 1917- ఈ చట్టాన్ని స్వయంగా టర్కీలో 1926లో రద్దు చేసివేసినా ఇప్పటికీ ఇస్రా యీల్‌లోని ముస్లి ములకొరకు అమల్లో ఉంది. ఇస్రాయీల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని అక్కడి సాధారణ చట్టాలకు లోబడి ఉండేలా చేసిందన్నదొక్కటే అక్కడి మార్చు.
ఇక మిగిలింది పాకిస్తాన్ ముస్లిమ్ పర్సనల్ లాలో మార్చు అవసరమని కోరే బెత్సాహికులు ఎంతో పటాటోపంతో పాకిస్తాన్ ఉదాహరణను ఇస్తారు. నిజానికి పాకిస్తాన్‌లో ఇప్పటికీ అమలులో ఉన్నది ముస్లిమ్ పర్సనల్ లాయే తప్ప మరొక సివిల్ కోడ్ కాదు. కాకపోతే “1961 కుటుంబ చట్టం” ద్వారా అక్కడ కొన్ని “సంస్కరణలు” చేయబడ్డాయి. అవి కూడా చాలా వరకు పరిపాలనాపరమయినవి, లేక క్రమబద్ధత దృష్ట్యా చేసినవే. చేసిన ఆ ముఖ్య సంస్కరణల్లో ఒకటేమంటే; ప్రతీ ఒక్క వివాహాన్ని రిజిస్టరు చేయించటం తప్పనిసరి. ఒకవేళ ఎవరయినా రిజిస్టరు చేయించకపోయినా ఆ వివాహం ధర్మ విరుద్ధం కాబోదు. కాని రిజిస్టరు చేయించనందుకు కొంత జరిమానా పడుతుంది. రెండవదేమంటే, ఒక భార్య ఉండగా మరొక వివాహం చేసుకోగోరేవారు ఆర్బిట్రేషన్ కౌన్సిల్ (Arbiration Council) నుండి అనుమతిని పొందవలసి ఉంటుంది. ఎవరయినా అనుమతి పాందకపోయినట్లయితే అటువంటివారి పై జరిమానా పడుతుంది. అంతేగాని అటువంటి వివాహం చెల్లనేరదనో లేదా ఆ వివాహం అధర్మమని ఖరారు చేయ
51
, టమో జరగదు. మూడవదేమంటే, భార్యకు విడాకులు ఇవ్వదలచిన పక్షంలో ఆ
' విషయాన్ని ఆర్బిట్రేషన్ కౌన్సిల్ దృష్టికి తీసుకురావటం భర్తపై తప్పనిసరి ' గావించబడింది. అప్పుడు ఆ కౌన్సిల్ ఆ దంపతుల వివాదంలో జోక్యం కల్పించు కుని వారి మధ్య సర్దుబాటు కోసం వీలయినంత వరకు ప్రయత్నిస్తుంది. దీన్ని బట్టి అవగతమయే్యేదేమంటే విడాకులిచ్చే అధికారాన్ని ఈ చట్టం పురుషుని నుండి గుంజుకోలేదు. దానికి బదులు అది ఒక నిబంధనానుసారం సర్దుబాటు కొరకు ఓ అవకాశం కల్పిస్తుంది. నాల్గవ 'సంస్కరణ' వారసత్వానికి సంబంధించినది. దీని ప్రకారం తండ్రిలేని మనవడికి, తండ్రిలేని మనవరాలికి ఆస్తి హక్కు ఇవ్వ బడుతుంది. అంటే వారి తండ్రి బ్రతికి ఉన్న పక్షంలో వారి తాతగారి ఆస్తి నుండి వారికి ఎంత భాగం లభించి ఉండేదో ఆ మేరకు వారికి వాటా లభిస్తుందన్న మాట. ఈ 'సంస్కరణ'లపై షరీఅత్ దృక్పథంతో కామెంట్ చేయవచ్చు. అంతే గాని పాకిస్తాన్‌లో ముస్లిమ్ పర్సనల్ లా మటుమాయమైపోయి దానిస్థానే ఏదో ముస్లిమేతర కోడ్ వ్రేళ్ళూనుకోవటమో, ముస్లిమ్ పర్సనల్ లాలో పెద్ద ఎత్తున మార్పులు జరగటమో ఎంత మాత్రం జరగలేదని గ్రహించాలి.
ఈపాటి మార్పును సయితం పాకిస్తాన్ ఉలమాలు తీవ్రంగా ఖండించారన్న
సంగతి మరువరానిది. అక్కడి సామాన్య ప్రజలు కూడా ఈ మార్పుపై భారీ ఎత్తున
నిరసన ప్రదర్శనలు జరిపారు.. అయిలే అక్కడి నిరంకుశ నియంతృత్వ ప్రభుత్వం
ప్రజాభిప్రాయానికి విలువనివ్వకుండా తన పనిని తాను చేసుకుపోయింది.
* ఒకానొక నియంతృత్వ ప్రభుత్వం తీసుకున్న చర్య (ప్రపంచంలోనే అతి పెద్ద) " ప్రజాస్వామిక దేశమైన ఇండియాకు ఎలా ఆదర్శప్రాయం కాగలదు?
విస్మరించరాని ఇంకొక విషయం ఏమిటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ముస్లిముల వ్యక్తిగత చట్టంలో మాత్రమే ఈ సంస్కరణలు తీసుకువచ్చింది. అక్కడి ముస్లి ములు మెజారిటీ వర్గంగా ఉన్నారు. కాని పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్కడ మైనారిటీల వ్యక్తిగత చట్టం జోలికిపోవటంగాని చేసిందా? లేదు. మరి అలాంటప్పుడు పాకి స్తాన్ యందలి ముస్లిమ్ పర్సనల్ లాలో చేయబడిన సంస్కరణలను ఆధారంగా
$2
తీసుకుని భారత దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లిముల వ్యక్తిగత చట్టంలో మార్పు జరిగి తీరాలనటం ఎంత వరకు న్యాయసమ్మతం?
కామన్ సివిల్ కోడ్ రూపురేఖలు
యూనిఫాం సివిల్ కోడ్‌ను చేయటంలో ప్రభుత్వం సఫలీకృతమయ్యిందందటే, దాని పరిధి ఒకటికన్నా ఎక్కువ వివాహాలు చేసుకోరాదన్న ఆంక్ష వరకే పరిమితం కాదు. పైగా అది .వివాహం, తలాక్, ఖులా, నికాహ్ రద్దు, వారసత్వం ఇత్యాది వ్యవహారాలన్నింటినీ తన పరిధిలోకి తీసేసుకుంటుంది. ఈ సందర్భంగా రూపాం దించబడే స్మృతి (౧010) ముస్లిమనీ, హిందువనీ, డైస్తవుడనీ, పారసీకుడనీ విచక్షణ చూపకుండా అందరికీ వర్తిస్తుంది. ఈ శాసన నిర్మాణం అన్ని రకాల మత బంధనాల నుండి స్వతంత్రంగా ఉంటుంది. ఇటువంటి చట్టం ఇస్లామ్ ధర్మశాస్త వేత్తలు జరిపే 'ఇజ్తెహాదాత్' (షరీఅత్ పరమార్థాల అన్వయింపులు)తో మాత్రమే కాదు. ముస్లిమ్ సమాజం సాధించే ఏకాభిప్రాయం, ఖుర్‌ఆన్ హదీసుల స్పష్ట మయిన ఆదేశాలకు కూడా విరుద్ధమవుతుంది.
యూనిఫాం సివిల్ కోడ్ ఎటువంటి అంశములతో కూడుకుని ఉంటుందనే దానికి సమాధానం దాన్ని నిర్మించే దురదృష్టకర పరిస్థితులు దాపురించినపుడే లభిస్తుంది. అయితే మొత్తమ్మీద ఆ కోడ్ ఏ ఏ పునాదులపై రూపుదిద్దుకుంటుందనే విషయం అనూహ్యం ఏమీ కాదు. ఎందుకంటే అది మెజారిటీ ఓటు ఆధారంగా రూపొందుతుంది. పార్లమెంటులో చట్టాల ఆమోదానికి ఏ పద్ధతి అవలంబిస్తారో అదే ఇక్కడా అవలంబించబడుతుంది. ఆ విధంగా క్రియాత్మకంగా మెజారిటీ వర్గం మాటే నెగ్గుతుంది. అధిక సంఖ్యాక వర్గం ఆలోచనాసరళి తెలియనిదేమీ కాదు. వారి ఆలోచనలు పగ్గం త్రెంచుకుని పాశ్చాత్య నాగరికత వైపునకు పరుగెడుతూ ఉంటాయి. ఉదాహరణకు బహుభార్యాత్వాన్ని నిషేధించాలి. విడాకులిచ్చే అధికారం మగవాడికి గాకుండా న్యాయస్థానాలకు ఉండాలి. ఆస్తి పాస్తుల్లో కొడుకులతో పాటు కుమార్తెలకు కూడా సమానంగా భాగం లభించాలి
(os
53
అధిక సంఖ్యాక వర్గం గత కొన్ని సంవత్సరాల క్రితం హిందూ కోడ్ బిల్‌ను ఆమోదించిన సంగతి అందరికీ తెలిసిందే. అవి హిందూ మ్యారేజ్ ఆక్ట్ (1౫64, Mariage Act), హిందూ సక్సెషన్ ఆక్ట్ (Hindu Succession Act) రూపంలో | అమల్లో ఉంది. ఈ చట్టాల ద్వారా అధిక నంఖ్యాక వర్గం మనస్తత్వం విస్పష్టమై పోయింది. కాబట్టి హిందూ కోడ్ అద్దంలో యూనిఫాం సివిల్ కోడ్ బింబాన్ని చూడవచ్చని ఎవరయినా అంటే అది పొరబాటు కాబోదు. ఇండియన్ సివిల్ కోడ్ అనే అంశంపై ప్రా. జె. డంకన్ (ప్రొఫెసర్, ఓరియంటల్ లాస్, లండన్ యూనివర్సిటీ) వెల్లడించిన అభిప్రాయం ద్వారా కూడా ఇది నిజమని నిర్ధారణ అవుతుంది. ఆయన ఇలా వ్రాశారు:
The Civil Code promissed in Article 44 of the Constitution is like the Hindu Code of which we have spoken before, a misnomer, but a convenient one. (Religion Law and the State in
India by J. Duncan . P. 546)
'ఏ సివిల్ కోడ్ గురించయితే రాజ్యాంగంలోని 44వ అధికరణలో వాగ్దా నం చేయబడిందో అది హిందూ కోడ్ లాంటిది. దాన్ని గురించి మేము ఇంతకుముందే చర్చించాము. ఒకవేళ (హిందూ కోడ్) పేరు దృష్ట్యా అపోహను నృష్టీన్తున్నవృటికీ నముచితమైన (సివిల్ కోడ్) మాత్రం అదే.”
అధిక సంఖ్యాక వర్గం మనస్తత్వం ఇలాంటిదయినప్పుడు యూనిఫాం సివిల్ కోడ్‌ను రూపొందించే. సమయంలో వారు తద్భిన్నంగా వ్యవహరిస్తారని ఎలా ఆశించగలం? వీటి నిమ్న విషయాల్లో, వివరాలలో కొంత మార్చు కానరా వచ్చునేమోగాని సూత్రప్రాయంగా నిర్ణయాలు మాత్రం హిందూ కోడ్ రూపంలోనే ఉంటాయి. మరో మాటలో చెప్పాలంటే హిందూ కోడ్‌కే స్వల్పమైన సవరణలతో. ఉమ్మడి సివిల్ కోడ్ (౮౧1002 Civil Code) స్థాయి కల్పించటం జరుగుతుంది. కనుక ప్రస్తుత హిందూ కోడ్ స్వరూప స్వభావాలను ఆకళింపు చేసుకుని అది
54
ముస్లిమ్ పర్సనల్ లాకు ఎంత భిన్నంగా, మరెంత వ్యాఘాతంగా ఉందో పోల్చి చూసుకోవటం ఎంతయినా అవసరం.
ప్రజా బాహుళ్యంలో హిందూ కోడ్‌గా వ్యవహరించబడుతున్న హిందూ వివాహ చట్టం (Hindu Marriage Act -1955) తత్వాన్ని బట్టి ఒక భార్య ఉండగా మరో వివాహం చేసుకోవడానికి వీలుండదు* దీనికి భిన్నంగా ఇస్లామ్ న్యాయం చేకూర్చే షరతుకు కట్టుబడి నలుగురు భార్యలను చేసుకునేందుకు అనుమతి నిచ్చింది. ఈ అనుమతి కూడా అసంఖ్యాకమైన ప్రయోజనాల, పరమార్థాల దృష్ట్యా ఇవ్వబడింది. కొన్ని పరిస్థితుల్లో రెండవ వివాహం అనిపార్యమయిపోతుంది: ఎవరి భార్య అయినా శాశ్వత రోగడ్రీస్తురాలయితే లేక వంధ్యత్వం గలదయితే ' అటువంటి పరిస్థితుల్లో మగాడి ముందు రెండు కర్తవ్యాలుంటాయి. ఒకటి: అతనామెకు విడాకులిచ్చి మరో ఆమెను మనువాడటం, రెండవది: ఆమెను తన అర్థాంగిగానే ఉంచి ఇంకొక వివాహం చేసుకోవటం. మొదటి చర్యకన్నా రెండవది మెరుగైనదనటంలో సందేహం లేదు. కాని బహుభార్యాత్వంపై నిషేధం ఉంటే ప్రజలు గత్యంతరం లేక మొదటి విధానాన్నే అవలంబిస్తారు. దానివల్ల దెబ్బతినేది స్తీ ప్రయోజనాలేనన్నది నిర్వివాదాంశం.
వితంతు సమస్యల దృష్ట్యా కూడా బహు భార్యాత్వానికి అనుమతించటం అవసరమే. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇస్లామ్ యావత్తు సచ్చీలత, సదాచార ప్రధానమైన ధర్మం. అది తన అనుయాయుల్లో సౌశీల్యాన్ని, పరిశుద్ధతను పెంపొందించగోర్తుంది. అందుకే అది పురుషుడిని అధర్మమైన, అక్రమమైన మార్గాల నుండి కాపాడే నిమిత్తం బహు భార్యాత్వపు ద్వారాలను
#& Any Marriage between two Hindus solemnized after commencement of this Act is void, if at the date of such marriage either Party had a husband or wife living; and the provisions of Section 494 and 495 of the Indian Penal Code shall apply accordingly (Section 17). రెండవ వివాహం గనక చేసుకున్నట్లయితే ఇండియన్ వీనల్ కోడ్ ప్రకారం ఏడేళ్ళ జైలు శిక్ష పడుతుందని చెవృబడీందన్సది గుర్తుంచుకోవాలి.
క్
తెరచి ఉంచింది. కాబట్టి ధర్మ సమ్మతమయిన ఈ ద్వారాలనే గనక మూసివేస్తే అది పరోక్షంగా అక్రమమైన, నీతి బాహ్యామయిన మార్గాలను తెరచినట్లే అవుతుంది. పాశ్చాత్య సమాజం చేజేతులా ఈ పరిస్థితినే కొనితెచ్చుకుంది. అక్కడ చట్టమయితే ఒకే భార్యను కలిగి ఉండాలని పట్టుబడుతుంది. కాని అక్రమంగా ఎందరు స్త్రీలతో సంబంధాలు పెంచుకున్నా తప్పులేదు. దాన్ని గురించి అడిగేవాడు కూడా ఉండడు. పైపెచ్చు పాశ్చాత్య సంస్కృతి లలిత కళలని, నాట్యం, సంగీతం లాంటి ఇతర సాధనాల ద్వారా లైంగిక విశ్శంఖలత్వాన్ని పెంచి పోషిస్తున్నది. ఒక వంక మగవాడు ఒక్క భార్యతో సరిపుచ్చుకోలేని భావోద్రేకాల వాతావరణాన్ని సృష్టిస్తూనే పాశ్చాత్య సమాజం మరోవంక చట్టపరంగా ఏకపత్నీ వ్రతానికి కట్టుబడమని ఆదేశిస్తోంది. ఈ పాశ్చాత్య సంస్కృతీ నాగరికతల ఈ ధ్వజవాహకులకు బహు భార్యాత్వపు ధర్మబద్ధమయిన మార్గాన్ని రద్దుపరిచే అర్హత ఎక్కడిది?
విడాకుల విషయంలో కూడా హిందూ కోడ్ ఇస్లామ్ విడాకుల చట్టానికి పూర్తి విరుద్ధంగానూ, ఆధునిక నాగరికతతో సామరస్యం చెందేదిగానూ ఉంది. అది విడాకుల అధికారాన్ని భర్తకుగాక కోర్టుకు అప్పజెప్పింది. ఒకవేళ ఎవర యినా తన భార్యకు విడాకులు ఇవ్వదలచినా లేదా భార్య భర్త నుండి విడాకులు పొందదలచినా ఆ భర్త లేక భార్య కోర్టుకు అభ్యర్థించుకోవలసి ఉంటుంది. అప్పుడు కోర్టు కోడ్‌లో పేర్కొనబడిన కారణాలలోని ఏదేని ఒక కారణం ఆధారంగా విడాకుల ఉత్తర్వు (060790) ఇస్తే వారిరువురి వేర్పాటు జరిగిపోతుంది. అయితే పెళ్ళయిన మూడేళ్ళలోపు వచ్చిన దరఖాస్తులను కోర్టు పరిశీలించదు.
కాగా ఇస్లామ్ పురుషునికి “తలాక్ హక్కును, స్త్రీకి 'ఖులా' హక్కును ఇచ్చింది. హిందూ కోడ్ మాత్రం ఈ రెంటినీ కాదంటుంది. అంటే పురుషునికి విడాకులు ఇచ్చే అధికారంగాని, స్త్రీకి విడాకులు కోరే హక్కుగాని లేదు. పైగా వారిరువురూ తమ వ్యవహారాన్ని (కోర్టు) రచ్చకెక్కించాలి. అందులో ఉన్న కీడు | అందరికీ విదితమే. భార్యాభర్తలు తమ సంసార గొడవలను మాటిమాటికీ కోర్టు
56
కెక్కించి కోర్టు చుట్టూ తిరగటం సముచితం కాదు. కోర్టులో చట్టబద్ధంగా ఆరోపణను నిరూపించటం కూడా అంత సులువయిన విషయం కాదు. ఇటువంటి చట్టపరమయిన చిక్కుల్ని సృష్టించటం మూలంగా జరిగేదేమిటి? భర్త ఇలాంటి విడాకుల పద్మవ్యూహంలో అడుగుపెట్టేబదులు భార్యను త్రిశంకు స్థితిలో పడవేస్తాడు, ఆమె జీవితం దుర్భరం చేస్తాడు, లేదా ఆమెపై తప్పుడు ఆరోపణలు, అసహ్యమయిన నిందలు మోపుతూ కోర్టుకు ఈడుస్తాడు - కోర్టు ద్వారా తీర్పు తన పక్షాన రాబట్టేందుకు, మరోవైపు భార్య గనక తన భర్త బారి నుండి విముక్తం కాదలిస్తే, 'ఖులా' వంటి సరళ మార్గాన్ని అవలంబించజాలదు. దానికి బదులు ఆమె కోర్టు చుట్టూ తిరగవలసి ఉంటుంది. అంత చేసీ తీర్పు ఆమె పక్షాన రాక పోతే ఆమె ఏ ముఖం పెట్టుకుని ఆ భర్తతో వేగగలుగుతుంది? ఏ భర్తకు వ్యతి రేకంగానయితే ఆమెవ్యవహారాన్ని కోర్టుకు తీసుకుపోయిందో ఆ భర్తతోనే ఎలాంటి అరమరికలు, ఆటుపోట్లు లేకుండా కాపురం చేయగలుగుతుందా? దూరదృష్టితో ఆలోచించినమీదట అవగతమయ్యేదేమిటంటే విడాకుల అధికారాన్ని భర్త నుండి లాక్కుని న్యాయస్థానానికి అప్పగించటం వల్ల స్త్రీకి మేలుకన్నా కీడే ఎక్కువ.
ఈ సందర్భంగా ఇంకో ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది - విడాకులిచ్చే అధికారం మగవాని నుంచి లాక్కోగా, ఎవరయినా ఒక ముస్లిమ్ షరీఆత్ పద్ధతి ప్రకారం తన భార్యకు విడాకులిచ్చేస్తే అప్పుడు జరిగేదేమిటి? చట్టమయితే అటువంటి విడాకులను ఒప్పుకోదు. కనుక అతను విడాకులు ఇచ్చి కూడా చట్ట నిబంధన ప్రకారం ఆమెను భార్యగానే చూడవలసి ఉంటుంది. వాస్తవానికి ఇప్పుడామె షరీఅత్ ప్రకారం అతని భార్య కాదు. అలాగే ఒక వ్యక్తి తన భార్య అక్రమ సంబంధాలు పెట్టుకున్నట్టు గమనించినా కోర్టులో దానికి తగు ఆధారాలను చూపలేకపోయినప్పుడు, విడాకులిచ్చే అధికారం కూడా అతనికి లేకుండాపోతే అట్టి పరిస్థితిలోనూ అతను ఆమెను తన భార్యగానే పరిగణించవలసి ఉంటుంది. నైతికత, సౌశీల్యం, పరిశుద్ధతలనే జీవిత మూలధనంగా భావించే ఒక ముస్లిమ్‌కు ఇది ఎంత ఆందోళన కలిగించే విషయమో ఊహించటం కష్టం కాదు.
57
మనోవర్తి (భరణం) విషయంలో హిందూ కోడ్ ఏమంటున్నదంటే, భార్యా భర్తల మధ్య వేర్పాటు జరుగుతున్న సమయంలో ఆయా స్ర్తీ పురుషుల ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం మనోవర్తిని నిర్ణయిస్తుంది, ఆ మనోవర్తి బాధ్యతను కేసు స్వరూపాన్ని బట్టి స్త్రీ పైననో, పురుషుని పైననో మోపు తుంది. దరఖాస్తుదారు పునర్వివాహం చేసుకునే వరకు, లేక ఇద్దరిలో ఎవరో ఒకరు మరణించే వరకూ మనోవర్తి ఇవ్వవలసి ఉంటుంది. అంటే పురుషునిపై ఎలాగయితే మనోవర్తి చెల్లించే భారం ఉందో అదే విధంగా స్త్రీపై కూడా తన మాజీ భర్తకు మనోవర్తి చెల్లించే బాధ్యత ఉంటుంది. ఇదీ “న్యాయం”, 'సమానత్వం' కోరుతున్నది! ఇద్దరి మధ్య దాంపత్య సంబంధాలు తెగిపోయినా మనోవర్తి బాధ్యత మటుకు మిగిలే ఉంటుంది. ఇదంతా విడాకుల వ్యవహారాన్ని మరింత క్లిష్టతరం చేయడం కాకపోతే మరేమిటి? దీనివల్ల కలిగే పరిణామాన్ని గురించి ఎవరూ ఆలోచించటంలేదు. భార్యతో కాపురం చేయడానికి ఇష్టం లేని భర్త ఆమెను వదలటంలో అసాధారణమయిన చిక్కులు, ప్రతిబంధకాలు ఎదుర్కొనడం చేత ఆమెను రకరకాలుగా బాధించటానికి శతవిధాలా యత్నిస్తాడు.
వారసత్వం విషయంలో హిందూ సక్సెషన్ ఆక్ట్ (Hindu Succession గీం[-1956) అమల్లో, ఉంది. దీన్ని కూడా సాధారణంగా హిందూ కోడ్‌గానే వ్యవహరిస్తారు. దీన్ని కూడా హిందూ ధర్మశాస్తంపై గాక ఆధునిక నాగరికతా పునాదులపైనే నిర్మించడం జరిగింది. వారసత్వపు పంపకం విషయమై ఈ కోడ్‌లో రూపొందించబడిన నియమాల సారాంశం ఇది:
(1) వారసత్వం అందరికంటే ముందు ప్రథమ శ్రేణి వారసుల్లో పంచబడు
తుంది. ప్రథమ శ్రేణి వారసుల్లో కొడుకు, కూతురు వితంతువు, తల్లి, మరియు
రాత బ్రతికుండగానే తండ్రి చనిపోయిన మనవడు, మనవరాలు ఉన్నారు.
వీరిలో ప్రతి ఒక్కరికీ సమానమయిన వాటా లభిస్తుంది. అయిలే మనవడు మనవరాళ్ళకు కలిపి ఒక వాటా మాత్రమే లభిస్తుంది.
(2) ప్రథమ శ్రేణి వారసులు గనక లేని పక్షంలో వారసత్వం ద్వితీయ శ్రేణి
58
వారసుల్లో పంపకమవుతుంది. ఇందులో మళ్ళీ స్థాయి విభజన ఉంది. ఈ పంపకంలో ప్రథమ స్థాయికి, ద్వితీయ స్థాయిపై, ద్వితీయ స్థాయికి, తృతీయ స్థాయిపై (అలాగే చివరి వరకు) ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ప్రథమ స్థాయిలో తండ్రి మాత్రమే వారసుడు. ద్వితీయ స్థాయిలో (కొడుకుకు కూతురు) మనుమరాలి కొడుకూ కూతుళ్ళు, సోదరీ సోదరులు ఉంటారు. తృతీయ స్థాయిలో కూతురి కొడుకు (మనుమడు) యొక్క సంతానం, కూతురి కూతురు (మనుమరాలు) యొక్క సంతానం ఉంటారు. నాల్గవ స్థాయిలోకి సోదరుని సంతానం, సోదరి సంతానం వస్తారు. ఐదవ స్థాయిలో తాత, తాతమ్మ, ఆరవ స్థాయిలో తండ్రి వదలిన వితంతువు, సోదరుడు వదలిన వితంతువు, ఎడవ స్థాయిలో పినతండ్రి మరియు మేనత్త ఉంటారు.
(3) చనిపోయినది స్తీ అయినట్లయితే ఆమె ఆస్తి మొదట కొడుకులు కుమార్తెలు (నాయనమ్మ బ్రతికి ఉండగానే తండ్రి చనిపోయిన మనుమలు, మనుమరాళ్ళు కూడా ఇందులోకి వచ్చేస్తారు. వారికి లభించే మొత్తం వాటా వారి తండ్రి వాటాకు సమానంగా ఉంటుంది) మరియు భర్త మధ్య పంపిణీ అవుతుంది. రెండో స్థాయిలో భర్త తరపు వారనులు వస్తారు. మూడో స్థాయిలో తల్లి దండ్రులు, నాల్గవ స్థాయిలో తండ్రి తరపు వారసులు, చివరన తల్లి తరపు వారసుల మధ్య పంపిణీ జరుగుతుంది.
వారసత్వపు ఈ చట్టాన్నే కాస్త మార్చి యూనిఫాం సివిల్ కోడ్ రూపమివ్వడం జరగవచ్చు. ఇది ఇస్లామ్ వారసత్వ చట్టానికి మౌలికంగా భిన్నమయింది. ఇస్లామ్ కూతురి వాటాను కొడుకు వాటాలో సగంగా ఖరారు చేసింది. దాని కారణాలను మేమింతకుముందే విశదీకరించి ఉన్నాము. కాని ఆధునిక నాగరికత యదార్థాలను ఉపేక్షించి గుడ్డిగా సమానతా సూత్రాన్ని నెలకొల్పింది. దాని ప్రకారం స్రీ పురుషులిద్దరికీ ఒకే స్థాయి కల్పించడం. జరిగింది. ఈ సంస్కృతీ ప్రభావంతోనే హిందూ కోడ్‌లో కొడుకూ కూతుళ్ళకు సమాన భాగాలు నిర్ధారించటం జరిగింది. లేకపోతే హిందువుల్లోనయితే కుమార్తెకు ఆస్తిని పంచి ఇచ్చే సంప్రదాయం
క్
ఎక్కడిది? కూతురికి ఆస్తి హక్కు లేదనటం ఒక ఆతివాదమయితే, సమానంగా పంచి ఇవ్వాలనటం మరో అతివాదం. అయితే ఇస్లామ్ ఈ రెండు అతివాదాలకు నడుమ మధ్యేమార్గాన్ని ప్రతిపాదించింది.
ఇస్లామ్ భార్య వాటాను - ఆమెకు సంతానం లేని పక్షంలో నాల్గవ (1/4) వంతుగా, సంతానం ఉన్న పక్షంలో ఎనిమిదవ (1/8) వంతుగా నిర్ణయించింది. తల్లి భాగం సంతానం ఉన్న పక్షంలో ఆరవ (1/6) వంతుగా, సంతానం లేని పరిస్థితిలో మూడవ (1/3) వంతుగా నిర్ధారించింది. హిందూ కోడ్‌లోనైలే తల్లి, వితంతువు, కొడుకు, కూతురు - అందరి భాగం సమానమే.
ఇస్లామ్ తండ్రి వాటాను సంతానం ఉన్న పక్షంలో 1/6వ వంతుగాను, సంతానంలేని పక్షంలో భార్యకు, తల్లికి ఇవ్వగా మిగిలిన సంపదనంతటికీ వారసు నిగాను నిర్ణయించింది. ఒకవేళ వారిలో (అంటే తల్లి మరియు భార్య) ఎవరూ ట్రతికిలేని పక్షంలో యావదాస్తికీ అతను వారసుడవుతాడు. కాని హిందూ కోడ్‌లో తండ్రిని ద్వితీయ శ్రేణి వారసుల్లో ఉంచటం జరిగింది. అంటే మొదటి శ్రేణి వారసులు - కొడుకు, కూతురు, భార్య, తల్లి - ఉండగా తండ్రికి ప్రాప్తించేదేమీ ఉండదు. ఆధునిక న్యాయం దృష్టిలో తల్లి వాటానయితే తప్పనిసరిగా లభించాలి. తండ్రికి మటుకు అవసరమే లేదు!
దగ్గరి బంధువులుండగా దూరపు బంధువుల కోసం ఇస్లాం భాగం నిర్ణయించలేదు. అయితే ఇలాంటి వారి కొరకు ఆస్తిలో మూడింట ఒక వంతు వరకు వీలునామా వ్రాసి ఇచ్చేందుకు అవకాశం కల్పించింది. అనాధ అయిపోయిన మనుమని సమస్యను పరిష్కరించడానికి ఈ వీలు ఎంతగానో తోడ్పడుతుంది. కాని హిందూ కోడ్‌లోని విధానం ఇందుకు భిన్నంగా ఉంది. అందులో సమీప బంధువులు (ఆత్మీయులు) ఉండగా ఇతరత్రా బంధువులకు కూడా భాగం ఖరారు చేయబడింది.
ప్రస్తుత హిందూ కోడ్ నిర్మాణంలో ఇస్లామ్ ప్రతిపాదించే వారసత్వపు చట్టం ద్వారా ఎంతో కొంత ప్రయోజనం పొందినప్పటికీ (ఉదాహరణకు, కూతురుకు
60
ఆస్తిలో భాగం ఇవ్వటం వగైరా) ఇది ఇస్లామ్ వారసత్వపు నిబంధనావళికి మౌలికంగా భిన్నమయింది. కాబట్టి ఇది గనక యూనిఫాం సివిల్ కోడ్ స్థాయిని సంతరించుకుందంటే ముస్లింలు లెక్కలేనన్ని ఇక్కట్లకు లోనుకావలసి వస్తుంది. ఒక బంధువుకు షరీఅత్ నిర్ణయించిన వాటాకన్నా ఎక్కువ లభించగా మరొకనికి తక్కువ లభిస్తుంది. ఇంకొకరికి అస్సలేమీ ప్రాప్తించదు. ఇది నిస్సందేహంగా అన్యాయం, అక్రమం.. ఎవరికయితే షరీఅత్ ఖరారు చేసిన దానికన్నా ఎక్కువ భాగం లభిస్తే అది అతనికి ధర్మసమ్మతం కాదు. ఎందుకంటే అతనికి ఆ సొమ్ము మరొకని హక్కును కాజెయ్యటం వల్ల ప్రాప్తించింది! అంటే యూనిఫాం సివిల్ కోడ్‌ని సమర్థించే ముస్లిములు హరామ్ (ధర్మ సమ్మతం కాని) సొమ్ము తినాలని కోరుకుంటున్నారన్న మాట!
ఇండియన్ సక్సెషన్ చట్టం
యూనిఫాం సివిల్ కోడ్ స్వరూప స్వభావాలను విశదపరచే ఉద్దేశ్యంతో వెనుకటి పుటల్లో హిందూ కోడ్ దృష్టాంతాలను ఇవ్వటం జరిగింది. యూనిఫాం సివిల్ కోడ్‌ను హిందూ కోడ్‌గా ఊహించడం సమంజసంకాదని ఎవరయినా ఆక్షేపించవచ్చు. దాన్ని ప్రక్కకు పెట్టి ఇండియన్ సక్సెషన్ ఆక్ట్ (Indian Succession Act 1925), స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్ (The Special Marriage Act 1954)ల అద్దంలోనూ యూనిఫాం సివిల్ కోడ్ మోమును చూసుకోవచ్చు.
ఇండియన్ సక్సెషన్ చట్టం ముస్లిములు, హిందువులు, బౌద్భులు, జైనులు, ' శిక్కులను మినహాయించి మిగిలిన పౌరులందరికీ వర్తిస్తుంది. ఈ చట్టంలో వివరించబడిన వారసత్వపు నియమాల సారాంశం ఇలా ఉంది -
(1) _ వీలునామా వ్రాయడంపై ఎలాంటి నిర్బంధం లేదు. ఏ వ్యక్తయినా తన " ఆస్తి అంతటికీ వీలు వ్రాసుకోగలడు. ($60101 -59)
. (2)
(3)
(4)
(5)
(6)
(7)
(8)
61
మృతుడు గనక వీలు వ్రాయకుండా ఉంటే, అతని వెనుకనున్న వారిలో వితంతువు ఉంటే వితంతువుకు 1/3వ వంతు, సంతానానికి 2/3వ వంతు ఆస్తి లభిస్తుంది. (56040233 [0 43)
ఒకవేళ మృతునికి సంతానం లేకపోయినట్లయితే వితంతువుకు 1/2వ వంతు దక్కుతుంది. మిగిలిన భాగం ఇతర బంధువులకు చెందుతుంది.
ఒకవేళ అతని వితంతువు (భార్య) కూడా బ్రతికి లేకుంటే యావదాస్తి
అతని పిల్లలలో విభజించబడుతుంది. పిల్లలు లేకపోయినట్లయితే
ఇతర బంధువులకు చెందుతుంది. ఇతర బంధువులు కూడా లేని. పక్షంలో ఆస్తి ప్రభుత్వపరమవుతుంది.
భర్త ఆస్తిలో వితంతువుకు ఎంత భాగం లభిస్తుందో (మృతురాలు భార్య అయినప్పుడు) అంతే భాగం భర్తకూ లభిస్తుంది.
సంతానం మధ్య ఆస్తి సమభాగంలో పంపకమవుతుంది. అంటే కొడుకులకు, కూతుళ్ళకు వాటాలు సమానంగా లభిస్తాయి.
ఒకవేళ సంతానంలో ఎవరైనా మరణించి ఉంటే వారి వాటాను తీసి మనుమలు మనుమరాళ్ళకు ఇవ్వటం జరుగుతుంది.
ఒకవేళ మృతునికి సంతానంలేనట్లయితే వితంతువు వాటా ఇచ్చివేయగా మిగిలిన ఆస్తి క్రింది విధంగా పంచిపెట్టడం జరుగుతుంది:
(అ) మృతుని తండ్రి గనక బ్రతికి ఉంటే అతను ఆ మొత్తం ఆస్తికి వారసుడవుతాడు.
(ఆ) తండ్రి బ్రతికి ఉండకపోతే తల్లి, సోదరుడు, సోదరీల మధ్య ఆస్తి సమానంగా పంపిణీ అవుతుంది.
ఈ చట్టం కూడా ఇస్లామ్ వారనత్వపు నియమాలకు మౌలికంగా
భిన్నమయినదే. ఇస్లామ్‌లో వీలునామా వ్రాసే హక్కు ఆస్తిలోని మూడింట ఒక
62
వంతుకు మాత్రమే ఉండగా ఈ చట్టం యావదాస్తికి వీలు వ్రాసుకునేందుకు అధికారం ఇచ్చింది. ఇస్లామ్, కొడుకుకు లభించే భాగంలో సగభాగం కుమార్తెకు ఇవ్వగా ఈ చట్టం కొడుకూ కూతుళ్ళకు నమాన భాగాలు లభింపజేస్తుంది. మృతునికి సంతానం ఉన్న పక్షంలో భార్యకు ఆస్తిలో 1/8వ వంతు లభిస్తుందని, సంతానం లేనట్లయితే 1/4వ వంతు లభిస్తుందని ఇస్లామ్ నిర్ణయించింది. కాగా; ఈ చట్టం భార్య వాటాను 1/3గా ఖరారు చేసింది. నంతానం లేకపోతే 1/2వ భాగం ఉంటుందని చెప్పింది. భర్తకు కూడా ఇదే నిష్పత్తిలో నంతానం ఉన్న పక్షంలో 1/3వ భాగం, లేని పక్షంలో 1/2 అంటుంది. కాని ఇస్లామ్ వారసత్వపు నియమాల ప్రకారం, భర్త భాగం సంతానం లేని స్థితిలో 1/2వ వంతుగానూ, సంతానమున్నట్లయితే 1/4గానూ నిర్ధారించబడింది.
సంతానముండగా తల్లిదండ్రుల హక్కును కూడా ఇస్లామ్ నిర్ణయించింది. కాని ఈ చట్టం ప్రకారం సంతానముండగా వారనత్వంలో తల్లి దండ్రులకు హక్కు ఉండదు.
ఈ ఉదాహరణల ద్వారా ప్రస్ఫుటమయ్యేదేమిటంటే, యూనిఫాం సివిల్ కోడ్ స్థానంలో ఇండియన్ సక్సెషన్ ఆక్ట్ - 1925ను తెచ్చిపెట్టినప్పటికీ ముస్లిముల వారసత్వపు వ్యవస్థ అంతా తలక్రిందులవక తప్పదు. మౌలికంగా షరీఅత్‌కు విరుద్ధమయిన చట్టం ఒకటి, - న్యాయానికీ, ధర్మానికీ కూడా వ్యతిరేకమయినది- వారిపై రుద్దినట్లవుతుంది.
స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్
స్పెషల్ మ్యారేజ్ (1954) చట్టానుసారం ఏ పురుషుడు మరియు స్త్రీ అయినా వివాహమాడవచ్చు. అయితే వారుభయులూ మ్యారేజ్ ఆఫీసరు సమక్షంలో ఈ చట్టానికి కట్టుబడి వివాహం చేసుకుంటున్నామని నియమానుసారం వ్రాతపూర్వకంగా ప్రకటించాలి.
63
ఈ చట్టంలోని షరీఅత్ శాసనాలకు విరుద్ధమయిన కొన్ని అంశాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము - ,() _ ఈ చట్టానుసారం ఒక భార్య ఉండగా మరో పెళ్ళి చేసుకోవటం నేరం. ఈ నేరానికి పాల్పడినందుకు ఏడేళ్ళ కారాగార శిక్ష పడుతుంది.
(2) _ పినతండ్రి కుమారుడు, మేనత్త కొడుకు, చిన్నమ్మ (తల్లి సోదరి) కొడుకు, మామ కొడుకుతో మనువాడకూడదు.
(3) _ విడాకులిచ్చే అధికారం కోర్టుకు మాత్రమే ఉంటుంది. భార్యా భర్తల్లోని ఏ ఒక్కరయినా విడిపోవాలని అనుకుంటే సదరు చట్టంలో ప్రస్తావించబడిన కారణాలలోని ఏ కారణాన్నయినా చూపుతూ విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకోవలసి ఉంటుంది. కోర్టు, వాంగ్మూలం పట్ల సంతృప్తి చెందిన పక్షంలో వేర్పాటుకు అంగీకరిస్తుంది.
(4) _ ఒకవేళ భార్యాభర్త లిరువురూ విడిపోవాలనుకున్నప్పటికిన్నీ విడాకుల కోసం వారు కోర్టును ఆశ్రయించక తప్పదు.
(5) వివాహమై మూడేళ్ళు గడవక పూర్వం విడాకుల కొరకు ఎలాంటి పిటీషన్ పెట్టుకోవటానికి వీల్లేదు.
(6) కోర్టు ద్వారా విడాకులు పొందిన వక్షంలో - అలా విడాకులు పాందినవారెవరూ ఒక సంవత్సరం దాకా మళ్ళీ పెళ్ళి చేసుకోజాలరు.
(7) కోర్టు ద్వారా విడాకులు పొందిన పక్షంలో - విడాకులు పొందిన మహిళ పునర్వివాహం చేసుకునే వరకూ లేదా ఆమె చనిపోయే వరకూ (మాజీ) భర్త మనోవర్తి ఇస్తూనే ఉండాలి.
(8) ఈ చట్టానికి కట్టుబడి వివాహం చేసుకున్న వ్యక్తి వారసత్వపు పంపిణీ విషయంలో అతని ఆస్తిపాస్తులపై “ఇండియన్ సక్సెషన్ ఆక్ట్ 1925' వర్తిన్తుంది. |
ముస్లిముల అభిమతం హిందూ కోడ్ ఇండియన్ సక్సెషన్ ఆక్ట్ స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్‌ల ఈ స్థూల పరిశీలన ద్వారా కొన్ని విషయాలు తేటతెల్లమవుతున్నాయి.
* ఈ మూడు చట్టాలు ఏ పుర్రె నుండి పుట్టాయో దాన్నుండే యూనిఫాం సివిల్ కోడ్ కూడా పుడుతుంది.
* ఏ మేధ అయితే ఒకటికి మూడు శాననావళులను రచించిందో అది ఎటువంటి తడబాటు లేకుండా యూనిఫాం సివిల్ కోడ్ పేరుతో నాల్గవ శాసనావళిని కూడా రచించవచ్చు.
* కుటుంబ నియమాల విషయంలో అధిక సంఖ్యాకుల ఆలోచనా ధోరణి ఆధునిక నాగరికత నుండి ఉనికిలోకి వచ్చిందే.
శ ఇంతకు ముందు ప్రస్తావించిన మూడు చట్టాలలోనూ ఆధునిక భావాలు, సిద్ధాంతాలు, ధోరణులు తొంగిచూస్తున్నాయి.
౫ ఈ వాస్తవాలు మనముందుండగా యూనిఫాం సివిల్ కోడ్ రూపురేఖల్ని ' ఊహించడం కష్టమేమీ కాదు. దీని స్వరూప స్వభావాలు నుస్పష్టమే. ప్రస్తావిత చట్టాలు మూడు (హిందూ కోడ్, సక్సెషన్ ఆక్ట్ స్పెషల్ మ్యారేజ్ ఆక్ట్) దీనికి అద్దంపడుతూనే ఉన్నాయి. స్త
కాగా; ఇస్లామ్ అల్లాహ్ తరపున అవతరింపజేయబడిన ధర్మం అని విశ్వసించే ఒక ముస్లిమ్, ముస్లిమ్ పర్సనల్ లా షరీఅత్‌లోని అత్యంత ముఖ్యమైన అంశమని నమ్మే ముస్లిమ్ - ముస్లిమ్ పర్సనల్ లాను వ్యతిరేకించటం, యూనిఫాం సివిల్ కోడ్ కావాలని కోరుకోవడం సాధ్యమా? కేవలం నవ నాగరికతా ఉద్దేశ్యాల పరిపూర్తి కోసమని, ఖుర్‌ఆన్ హదీసులకు వ్యతిరేకంగా ముస్లిమ్ పర్సనల్ లాలో చేయబడే ఏ సవరణనూ అతను సమర్థించలేడు.
65
దైవకృప వల్ల ఈ విషయమై ముస్లిమ్ ప్రజాభిప్రాయం జాగృతమయింది. ముస్లిమ్ పర్సనల్ లాలో ఎలాంటి మార్పునూ అంగీకరించడానికి వారు సంసిద్ధంగా లేరు. ముస్లిమ్ మహిళలు షరీఅత్ చట్టాలతో విసిగి వేసారిపోయారని అందరినీ నమ్మించటానికి ముస్లిమ్ పర్సనల్ లా వ్యతిరేకులు ప్రయాసపడుతుండగా ఆ ముస్లిమ్ మహిళలే ముస్లిమ్ పర్సనల్ లా పరిరక్షణకై రంగంలోకి కదలివచ్చారు. వారు బొంబాయి, నాగపూరు, నాందేడ్, పర్శిన్సీ హైదరాబాదు, పూనా, అహ్మదాబాద్, లక్సో అలహాబాద్, బెంగుళూరు, కలకత్తా, కాన్పూర్ నగరాలలో బ్రహ్మాండమయిన సభలు నిర్వహించి, వేల సంఖ్యలో పాల్గొని ముస్లిమ్ పర్సనల్ లాకు మద్దతుగా బలోపేతంగా నిలబడ్డారు. షరీఅత్ చట్టాల పట్ల తాము పూర్తిగా సంతృప్తి చేంది ఉన్నామని, తమ సమస్యల పరిష్కారానికి కేవలం ఆ చట్టాలే చాలని ఘంటా పథంగా, విశ్వాసం ఉట్టిపడే కంఠంతో ఎలుగెత్తి చాటారు.
ముస్లిమ్ పర్సనల్ లా ప్రాముఖ్యత, దాని ధార్మిక ప్రాతిపదిక రీత్యా, ఇంకా దానికి అనుకూలంగా ఉన్న ముస్లిమ్ ప్రజాభిప్రాయం దృష్ట్యా దాన్ని మార్చాలి లేక రద్దు చేయాలన్న డిమాండ్ ఎవరి తరపున వచ్చినా అది సరైనది కాదు. ముస్లిమ్ లనబడే వర్గాలకయితే ఎవరికీ ఇటువంటి డిమాండు ఏ విధంగానూ శోభించదు. ఇకపోతే; ముస్లిమేతర సోదరుల మాటకు వస్తే వారు ముస్లిముల సమస్యలను, వారి ఇబ్బందులను చిత్తశుద్ధితో అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే ముస్లిముల యెడల వారంతటవారే ఉదార వైఖరికి సంసిద్ధమవుతారు. ముస్లిమ్ పర్సనల్ లా విషయంలో ముస్లిముల వైఖరి పట్ల వారికి ఉన్న అనుమానాలు కూడా తొలగి పోతాయి. పైపెచ్చు పర్సనల్ లా అవలంబన వారి (ముస్లిముల) ధార్మిక బాధ్యత అన్న సంగతిని వారు గుర్తిస్తారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా ముస్లిముల భావాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇస్లాం ధర్మంలో జోక్యంగా పరిగణించబడే ఎటువంటి చర్యనూ అది ముస్లిమ్ పర్సనల్ లా
విషయంలో చేపట్టరాదు. దీనికి బదులు అది సాధ్యమైనంతవరకు మత, .
66
ాంస్కృతిక స్వేచ్చను రూఢపరచి తద్వారా ప్రజాస్వామ్య పటిష్టతకు మార్గం సుగమం చేయాలి.
సంస్కరణకు సరైన విధానం
ముస్లిమ్ సమాజం ధార్మికంగా లోనయి ఉన్న అధోగతి మూలంగా దాని సామాజిక జీవనంలో కూడా రకరకాల చెడుగులు పుట్టుకువచ్చాయన్న సంగతి త్రోసిపుచ్చలేనిది. పురుషులు స్త్రీల హక్కుల్ని గాని, స్రీలు పురుషుల హక్కుల్ని గాని సజావుగా నెరవేర్చటం లేదన్నది నిజం. కుటుంబ అధిపతి అయిన దృష్ట్యా ఇస్లామ్ మగవాడికి ఇచ్చిన విన్ఫృతాధికారాలు దుర్వినియోగమవడం కూడా కద్దు: అయితే దీని బాధ్యత ఇస్లామ్ పైగాని, షరీఅత్‌పై గాని రాకూడదు. దీని బాధ్యత అంతా నిజానికి సమాజ సభ్యులపై పడుతుంది. ఎందుకంటే పరిస్థితుల ఈ వికృత స్వరూపం వాస్తవానికి ఇస్లామ్ బోధనలను పాటించకపోవటం వల్లనే ఏర్ప డింది. అందుచేత ఈ చెడుగుకు బాధ్యతనంతా షరీఅత్ శాసనాలపైకి నెట్టేసి, సంస్కరణ నిమిత్తం ఇస్తామేతర చట్టాలను ప్రయోగించే తిరకాసు చికిత్స ఎంత మాత్రం ఆరోగ్యకరం కాదు. ఆ మాటకు వస్తే ముస్లిమ్‌ల జీవితంలో చెరుపుకు గురికాని క్షేత్రం ఏది మిగిలింది గనక? ఈ విధంగా ప్రతిదానికీ షరీఅత్ శాసనాలపై బాధ్యత మోపుతూపోతే ఆఖరికి ఇస్లామ్‌నే విడిచిపెట్టేసి ఆధునిక నాగరికతలోనే రోగాలన్నింటి చికిత్సను వెతకవలసి ఉంటుంది. ఇస్లామ్ పట్ల కుశంకలూ, ఆధునిక నాగరికత పట్ల తియ్యని కలలా? హాలాహలాన్ని అమృతంగా భావించటం అంటే ఇంకేమిటి?
సమాజాన్ని సంస్కరించాలనే అనుకుంటే, ప్రజల్లో పాపభీతిని దైవభక్తినీ "పెంపొందించాలి. అందుకుగాను ఇస్లామ్‌బోధనలను వారికి వివరించాలి. వారిలో నైతిక భావనను మేల్కొల్పడానికి, జీవిత పరమార్ధాన్ని వారు గుర్తించేలా చేయటానికి ప్రయత్నించాలి. సమాజ సంస్కరణ కోసం ఈ నైతిక విప్లవం ఎంతయినా అవస
67
రం. అప్పుడే వారు ఇస్లామ్‌ను ఓ జీవన వ్యవస్థగా నమ్మి అవలంబిస్తారు. అప్పుడే జీవితపు అన్ని క్షేత్రాల్లోనూ ఖచ్చితంగా దాన్ని అనుసరించగలుగుతారు. అయితే సమాజంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, షరీఅత్ అన్వయింపు సరిగా జరుగు తున్నదా అన్న విషయాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా నేడు ముస్లిమ్ స్రీలకు ఎదురవుతున్న పరిస్థితుల దృష్ట్యా తలాక్, ఖులా తదితర సమస్యలను పరిశీలించి ఈ సందర్భంలో ముస్లిమ్ మహిళలకు ఎదురవుతున్న సంక్లిష్టతను అధిగమించేం దుకు మార్గాలను వెదకాలి. కాల పరిస్థితుల దృష్ట్యా షరీఅత్ అభిమతాన్ని నెరవేర్చే దృష్టితో - ఖుర్‌ఆన్ హదీసుల హద్దుల్లో ఊంటూ - ఎదురవుతున్న కొంగ్రొత్త సమ స్యల పరిష్కారాలను అన్వేషిస్తే, తదనుగుణంగా నియమాలను రూపొందించుకో దలిస్తే అందుకు నిస్సందేహంగా ఇస్లామ్‌లో అవకాశం ఉంది. అయితే ఈ పని దారినపోయే దానయ్య చేసేది కాదు. ఆధునిక నాగరికత చేత మోహించబడినవారు, రాజకీయ స్వలాభాల కోసం ప్రాకులాడుతున్నవారు కూడా ఈ బాధ్యతను నిర్వ ర్తించలేరు. ఇటువంటి వారేగనక 'ఇజ్లెహాద్' (షరీఅత్ అన్వయింపు శాస్తం) కొరకు ఉపక్రమిస్తే షరీఅత్ రూపురేఖలనే మార్చివేస్తారు. బాధ్యతాయుతమయిన ఈ కార్యాన్ని విస్తృత ధర్మజ్ఞానం, అందులో అంతర్ దృష్టిగలవారు, భయభక్తులు, నిష్టాగరిష్ట జీవితం గడిపేవారు, వర్తమాన పరిస్థితుల అవగాహన గలవారు మటుకే ఈ మహత్కార్యం చేపట్టగలరు. దైవకృప వల్ల ముస్లిమ్ సమాజంలోని ఇలాంటి సజ్జనులు దీని వైపు శ్రద్ధ చూపుతున్నారు. ముస్లిమ్ విద్వాంసులు ఈ ' విషయమై సామూహికంగా సమాలోచనలు జరుపుతున్నారు. నేడు ఎదురవుతున్న "సమస్యలకు వారు సర్వోత్తమ పరిష్కారాలు సూచిస్తారని ఆశించవచ్చు.
- సమాప్తం -